- Home
- Technology
- Gadgets
- Amazon sale: రూ. 6 వేలతో మీ ఇంటిని థియేటర్‌గా మార్చేయండి.. అమెజాన్ సేల్‌లో అదిరే ఆఫర్
Amazon sale: రూ. 6 వేలతో మీ ఇంటిని థియేటర్‌గా మార్చేయండి.. అమెజాన్ సేల్‌లో అదిరే ఆఫర్
ఓటీటీలు వచ్చిన తర్వాత ఇంట్లోనే థియేటర్ సెటప్ చేసుకుంటున్నారు. అయితే పెద్ద సైజ్ స్క్రీన్ టీవీలు కొనాలంటే లక్షల్లో ఖర్చు చేయాలి. కానీ అలాంటి అవసరం లేకుండా ఇప్పుడు ప్రొజెక్టర్లు అందుబాటులోకి వచ్చాయి.
- FB
- TW
- Linkdin
Follow Us

E GATE Atom 3X Projector
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ గేట్ ఆటమ్ 3 ఎక్స్ ప్రొజెక్టర్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. చూడ్డానికి చిన్నగా ఉన్నా మంచి అనుభూతిని అందిస్తుందీ ప్రొజెక్టర్. ఈ ప్రొజెక్టర్ అసలు ధర రూ. 21,999గా ఉండగా, 68 శాతం డిస్కౌంట్‌తో రూ. 6990కి లభిస్తోంది. ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.?
ఈ ప్రొజెక్టర్ నేటివ్ 1080p ఫుల్ HD రెజల్యూషన్‌ను అందిస్తుంది. అలాగే 4K వీడియోలను డీకోడ్ చేయగల సామర్థ్యం కూడా ఉంది. 5000:1 కాంట్రాస్ట్ రేషియో ఈ ప్రొజెక్టర్ సొంతం. ఈ ప్రొజెక్టర్ సహాయంతో 210 ఇంచెస్ స్క్రీన్‌పై హెచ్‌డీఆర్ సపోర్ట్‌తో కూడిన వీడియోలను చూడొచ్చు.
అత్యధునిక చిప్
ఈ ప్రొజెక్టర్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది శక్తివంతమైన అమోలాజిక్ టీ950S చిప్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ARM Cortex 450 GPU ఈ ప్రొజెక్టర్ సొంతం. ఇక ఇందులో 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌ను అందించారు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనిలివ్‌తో పాటు మరెన్నో ఓటీటీ యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది.
థియేటర్ ఫీల్
ఈ ప్రొజెక్టర్‌లో 180° రొటేషన్ ఫీచర్‌ను అందించారు. దీంతో చిన్న గదుల్లోనూ థియేటర్ ఫీల్ పొందొచ్చు. దీనిని మీరు కావాల్సిన కోణంలో తిప్పి స్క్రీన్ చూడొచ్చు. చిన్న గదుల్లోనూ పెద్ద స్క్రీన్ పొందేలా షార్ట్ థ్రూ లెన్స్ (1.1:1) ఉపయోగించారు. ఇది తక్కువ దూరంలోనే పెద్ద చిత్రం ప్రొజెక్షన్‌కు సపోర్ట్ చేస్తుంది.
అద్భుతమైన కెస్టోన్ ఫీచర్
ఇక ఈ ప్రొజెక్టర్ అద్భుతమైన ఆటో కీస్టోన్ + 4D/4P Keystone Correction ను అందిస్తుంది. దీంతో వీడియో దానంతటదే సెట్ అవుతుంది. ఈ ప్రొజెక్టర్‌కు HDMI, USB, 3.5 mm ఆడియో అవుట్, Bluetooth 5.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. అలాగే స్క్రీన్ మిర్రరింగ్‌తో కూడా వీడియోలు చూడొచ్చు. ఈ ప్రొజెక్టర్‌పై కంపెనీ ఏడాది వారంటీ అందిస్తోంది.