- Home
- Business
- Vida VX2: హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 15వేల డిస్కౌంట్.. రూ. 44 వేలకే కళ్లు చెదిరే ఫీచర్లు
Vida VX2: హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 15వేల డిస్కౌంట్.. రూ. 44 వేలకే కళ్లు చెదిరే ఫీచర్లు
ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. బడా ఆటో మొబైల్ కంపెనీలు సైతం ఈవీ వాహనాలు లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా హీరో మోటోకార్ప్ ఓ స్కూటీపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది.

రూ. 44 వేలకే స్కూటీ
హీరో మోటోకార్ప్ ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన Vida VX2 ఎలక్ట్రిక్ స్కూటర్‌కి సంబందించిన బేసిక్ వెర్షన్ VX2 Go ప్రారంభంలో రూ. 59,490 (ఎక్స్‌షోరూమ్)గా ప్రకటించింది. అయితే కేవలం కొన్ని రోజులకే కంపెనీ దీని ధరను రూ. 15,000 తగ్గించి రూ. 44,990గా మార్చింది. అయితే ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
రెండు వేరియంట్స్‌లో
హీరో Vida VX2ను రెండు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. వీటిలో ఒకటి VX2 Go బేసిక్ మోడల్ కాగా, VX2 Plus టాప్ ఎండ్ వెర్షన్. ఈ రెండు మోడళ్ల మధ్య తేడాలు ప్రధానంగా బ్యాటరీ సామర్థ్యం, టాప్ స్పీడ్, రేంజ్, యాక్సిలరేషన్ పరంగా ఉంటాయి. ధర విషయానికొస్తే VX2 Go బేస్ ధర రూ. 44,990కాగా, VX2 Plus బేస్ ధర రూ. 58,000గా ఉంది.
VX2 Go ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.?
VX2 Go మోడల్‌లో 2.2 kWh రిమూవబుల్ బ్యాటరీని అందించారు. ఈ స్కూటీని ఒక్కసారి రీఛార్జ్ చేస్తే నాన్‌స్టాప్‌గా 92 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. 0 నుంచి 40 కిమీ వేగాన్ని 4.2 సెకన్లలో చేరుతుంది. ఇక ఈ స్కూటీ గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. 62 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ అవుతుంది.
VX2 Plus ఫీచర్లు
VX2 Plus ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 3.4 kWh డ్యూయల్ రిమూవబుల్ బ్యాటరీలను అందించారు. ఈ స్కూటీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 142 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. కేవలం 3.1 సెకన్లలో 40 కిలో మీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అలాగే ఇందులో 4.3 అంగుళాల TFT డిస్‌ప్లే, 27.2 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్‌ను అందించారు. ఈ స్కూటీ 62 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది.
ఏడు రంగుల్లో
అయితే ఈ రెండు స్కూటీలు బ్యాటరీ యాజ్ ఏ సబ్‌స్క్రిప్షన్ (BaaS) మోడల్‌లో లభిస్తున్నాయి. విడా వీఎక్స్ 2 ఏడు రంగులు బ్లూ, బ్లాక్, ఎల్లో, రెడ్, వైట్, ఆరెంజ్, యాష్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. అయితే బ్యాటర్ సబ్‌స్క్రిప్షన్‌తో అయితేనే పైన తెలిపిన ధరలు వర్తిస్తాయి. ఒకవేళ సబ్‌స్క్రిప్షన్ లేకుండా అయితే ధర ఎక్కువగా ఉంటుంది. పూర్తి వివరాల కోసం మీకు సమీపంలో ఉన్న షోరూమ్‌ను సంప్రదించండి.