- Home
- Technology
- Gadgets
- Smart Cooking: స్మార్ట్‌ఫోన్‌తో వంట చేసేయొచ్చు.. ఇలాంటిది ఒకటి ఉంటే ఇక లైఫ్ బిందాస్
Smart Cooking: స్మార్ట్‌ఫోన్‌తో వంట చేసేయొచ్చు.. ఇలాంటిది ఒకటి ఉంటే ఇక లైఫ్ బిందాస్
Smart Cooking: ఇంట్లో వంట చేయడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేకుండా, ఒకే డివైజ్‌తో ఎన్నో రకాల వంటకాలను తయారు చేసుకునేలా యుప్లియన్స్ 2.0+ స్మార్ట్ కుకింగ్ అసిస్టెంట్‌ను రూపొందించారు. అమెజాన్‌లో ఉన్న ఈ ప్రొడక్ట్ పూర్తి వివరాలు.

750కి పైగా వంటకాలతో స్మార్ట్ కుకింగ్
ఈ డివైజ్‌లో 750కి పైగా గైడెడ్ రెసిపీలు అందుబాటులో ఉన్నాయి. కొత్త వంటకాలను కూడా తరచుగా యాడ్ చేస్తుంటారు. యూట్యూబ్ వీడియోల నుంచి రెసిపీలను ఏఐ సాయంతో ఇంపోర్ట్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ద్వారా రెసిపీలను సెలక్ట్ చేసుకొని, స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరిస్తూ వంట చేసుకోవచ్చు. ముఖ్యంగా వంట చేయడంలో ఎక్కువ అనుభవం లేని వారికి ఈ గైడెడ్ విధానం ఉపయోగపడుతుంది. ఇందులో 9 భారతీయ భాషలకు సపోర్ట్ ఉండటం మరో ప్రత్యేకత.
ఒకే జార్‌లో ఎన్నో పనులు
Upliance 2.0+లో కూరగాయలు కోయడం, కలపడం, గ్రైండ్ చేయడం, పిండిని కలపడం, ఆవిరిపై ఉడికించడం, వేయించడం, బ్లెండ్ చేయడం వంటి పలు పనులు చేయవచ్చు. ప్రత్యేకమైన ఓమ్ని బ్లేడ్‌తో వేర్వేరు వంట పనులను ఒకే జార్‌లో పూర్తి చేసేలా డిజైన్ చేశారు. ఇందులో 120°C వరకు హై-హీట్ కుకింగ్ సదుపాయం ఉంది. దీంతో తాలింపు, బ్రౌనింగ్ వంటి పనులు కూడా చేసుకోవచ్చు. సెన్సర్లు, స్మార్ట్ అల్గారిథమ్స్ వంట సమయంలో వేడి, సమయం, బ్లేడ్ వేగాన్ని అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేస్తాయి. ఒకే జార్‌లో వంట పూర్తవడం వల్ల ఉపయోగించే పాత్రలు తగ్గి, వంట తర్వాత శుభ్రం చేసే పని కూడా సులభమవుతుంది. ధర విషయానికొస్తే అమెజాన్ లో దీని ధర రూ. 34,999కి లభిస్తోంది.
ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి
ఈ స్మార్ట్ కుకింగ్ డివైజ్‌లో బిల్ట్-ఇన్ వెయింగ్ స్కేల్ ఉంటుంది. పదార్థాలను కొలవడంతో పాటు పోషక విలువలను ట్రాక్ చేసుకునే అవకాశం ఉంది. క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వు వంటి వివరాలను తెలుసుకోవచ్చు. తక్కువ నూనెతో వండే వంటకాలు, హై-ప్రోటీన్ ఫుడ్, జైన్, వేగన్, పిల్లలకు అనుకూలమైన రెసిపీల వంటి విభిన్న ఆప్షన్లు ఉన్నాయి. దీంతో తమ ఆహార అవసరాలకు అనుగుణంగా వంటకాలను ఎంచుకోవచ్చు.
వైఫై కనెక్టివిటీతో ఫోన్ నుంచే కంట్రోల్
Upliance 2.0+ను వైఫై ద్వారా యాప్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ ద్వారా వంట ప్రక్రియను కంట్రోల్ చేయడంతో పాటు అవసరమైనప్పుడు రెసిపీల్లో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో 500W మోటార్, 1000W హీటింగ్ ఎలిమెంట్ ఉన్నాయి. మొత్తం 1500W పవర్ సామర్థ్యంతో పనిచేస్తుంది. భారతీయ వంటగదులు, పదార్థాలు, వంట విధానాలను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించారు. 220-240V, 50Hz విద్యుత్ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తుంది.
బాక్స్‌లో ఏముంటాయి? వారంటీ ఎంత?
Upliance 2.0+తో పాటు స్పాటులా, కొలిచే స్పూన్లు, స్టీమర్ బాస్కెట్, బటర్‌ఫ్లై విస్క్, బ్లేడ్, బ్లేడ్ కవర్, బ్లేడ్ లాక్, మైక్రోఫైబర్ క్లాత్, జార్ లిడ్, జార్, లిడ్ క్రౌన్, ప్రధాన యూనిట్ వంటి యాక్సెసరీస్ అందిస్తారు. ఈ డివైజ్ బరువు సుమారు 10 కిలోలు. దీని కొలతలు 30.5 x 31.8 x 33 సెంటీమీటర్లు. తెలుపు రంగులో లభిస్తుంది. కొనుగోలుతో 1 సంవత్సరం మ్యానిఫ్యాక్షర్ వారంటీ లభిస్తుంది. అదనంగా మరో ఏడాది వారంటీని ప్రత్యేకంగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, రోజువారీ వంటలో సమయం తగ్గించుకోవాలని, ఒకే డివైజ్‌తో పలు రకాల పనులు చేయాలని కోరుకునేవారికి Upliance 2.0+ ఉపయోగపడే స్మార్ట్ కిచెన్ డివైజ్‌గా చెప్పవచ్చు.

