- Home
- Technology
- Gadgets
- మోటరోలా ఎడ్జ్ 50 ప్రో పై భారీ ఆఫర్: రూ.20,000 వరకు తగ్గింపు.. అమెజాన్ లో సూపర్ డీల్
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో పై భారీ ఆఫర్: రూ.20,000 వరకు తగ్గింపు.. అమెజాన్ లో సూపర్ డీల్
Motorola Edge 50 Pro : మోటరోలా ఎడ్జ్ 50 ప్రో పై అమెజాన్ భారీ ఆఫర్ ప్రకటించింది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లతో ఈ ఫోన్ ధర రూ.15,389 వరకు తగ్గుతుంది. ఆ వివరాలు మీకోసం.

అమెజాన్ లో మోటరోలా ఎడ్జ్ 50 ప్రో పై భారీ డిస్కౌంట్
భారత మార్కెట్లో రూ.35,999 ధరతో లాంచ్ అయిన మోటరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.26,489కి లిస్ట్ అయింది. అంటే నేరుగా రూ.9,510 తగ్గింపు ఉంది.
అలాగే, ఎస్ బ్యాంక్ లేదా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ట్రాన్సాక్షన్లపై రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్ ఇచ్చి ఎక్స్చేంజ్ చేస్తే మరింత సేవ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, పాత మోటరోలా ఎడ్జ్ 40 నియో ఎక్స్చేంజ్ చేస్తే రూ.9,600 వరకు తగ్గింపు పొందొచ్చు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.15,389కి చేరుతుంది.
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో డిస్‌ప్లే ఫీచర్లు
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల 1.5K pOLED కర్వ్‌డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 2000 పీక్ నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. దీంతో గేమింగ్, వీడియోలు,రోజువారీ వినియోగంలో కలర్-ఆక్యురసీలో సూపర్ గా ఉంటుంది.
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో లో Snapdragon 7 Gen 3 చిప్‌సెట్
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో లో Snapdragon 7 Gen 3 చిప్‌సెట్ కలిగి ఉంది. ఇది 12GB RAM, 256GB స్టోరేజ్ తో అందుబాటులో ఉంది. ఈ కాంబినేషన్ వల్ల మల్టీటాస్కింగ్, గేమింగ్, యాప్ వినియోగంలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ 4,500mAh బ్యాటరీతో 125W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంది. అంటే కొన్ని నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు.
ట్రిపుల్ కెమెరా సెటప్.. ఫోటోగ్రఫీ ప్రియులకు పండగే
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది.
• 50MP ప్రైమరీ కెమెరా OIS సపోర్టు ఉంది
• 13MP అల్ట్రా-వైడ్ లెన్స్
• 10MP టెలిఫోటో కెమెరా 3x ఆప్టికల్ జూమ్ సపోర్టు ఉంది
ఫ్రంట్ కెమెరా 50MP సెన్సార్ తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కు ఇది అత్యుత్తమమైన ఆప్షన్ అవుతుంది. బ్యాక్, ఫ్రంట్ కెమెరాలతో 4కే వరకు వీడియో రికార్డులు చేయవచ్చు.
ఈ డీల్ ఎప్పటివరకు అందుబాటులో ఉంటుంది?
అమెజాన్ లాంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇలాంటి ఆఫర్లు ఎక్కువ కాలం ఉండవు. కాబట్టి ఆసక్తి ఉన్నవారు త్వరగా డీల్‌ను ఉపయోగించుకోవడంతో తక్కువ ధరకే మంచి ఫీచర్లతో ఉన్న ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ప్రీమియం మిడ్-రేంజ్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి ఎంపికగా ఉంది.