MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Technology
  • ఆసియా కప్ 2025: భారత జట్టు నిండా ఈ రెండు ఐపీఎల్ జట్ల ప్లేయర్లే

ఆసియా కప్ 2025: భారత జట్టు నిండా ఈ రెండు ఐపీఎల్ జట్ల ప్లేయర్లే

Asia Cup 2025 India: ఆసియా కప్ 2025 కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అయితే, ఈ టీమ్ లో రెండు ఐపీఎల్ జట్ల ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. ఒక టీమ్ నుంచి అయితే ఒక్కరు కూడా లేరు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 21 2025, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆసియా కప్ 2025: భారత జట్టులో గిల్
Image Credit : X/LoyalSachinFan

ఆసియా కప్ 2025: భారత జట్టులో గిల్

ఆసియా కప్ 2025 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా భారత జట్టును ప్రకటించింది. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగనుంది. ఆగస్టు 19న అజిత్ ఆగార్కర్ భారత జట్టును ప్రకటించారు. భారత జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతుండగా, ఓపెనర్ శుభ్ మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. 

ఈసారి జట్టులోకి జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ వంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి వచ్చారు. గతంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్ బాధ్యతలను గిల్ కు అప్పగించారు. అయితే, ఆసియా కప్ భారత జట్టులో ఐపీఎల్ లోని రెండు జట్ల ప్లేయర్ల ఆధిపత్యం కనిపిస్తోంది. ఏ ఐపీఎల్ జట్టు నుంచి ఎంత మంది ప్లేయర్లు టీమిండియాలో చోటుదక్కించుకున్నారనే వివరాలు గమనిస్తే టాప్ లో ముంబై ఉంది. ఇతర జట్ల వివరాలు గమనిస్తే..

DID YOU
KNOW
?
ఆసియా కప్ 2025
ఆసియా కప్ ను ఇప్పటివరకు వన్డే, టీ20 ఫార్మాట్ లో నిర్వహించారు. రాబోయే ఐసీసీ ఈవెంట్ క్రమంలో ఆసియా కప్ ఫార్మాట్ ను నిర్ణయిస్తున్నారు. ఆసియా కప్ 2025 ఎడిషన్ టీ20 ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భారత జట్టులో ముంబై ఇండియన్స్ ఆధిపత్యం
Image Credit : X/BCCI

భారత జట్టులో ముంబై ఇండియన్స్ ఆధిపత్యం

భారత జట్టులో ఐపీఎల్ జట్ల ప్రాతినిధ్యం స్పష్టంగా కనిపించింది. 10 జట్లలో 9 జట్ల ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. అయితే, ముంబై ఇండియన్స్ నుంచి అత్యధికంగా నలుగురు ప్లేయర్లు ఎంపికవడం విశేషం. అయితే, లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఒక్క ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. ముంబై ఇండియన్స్ తర్వాత కోల్ కతా నైట్‌రైడర్స్‌కు ఎక్కువ ప్రాతినిధ్యం లభించింది.

Related Articles

Related image1
టెన్సర్ G5 చిప్, సూపర్ కూల్ ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ లాంచ్.. ధర ఎంత?
Related image2
ఆసియా కప్ 2025: శ్రేయస్‌, జైస్వాల్‌ టీమిండియాలో ఎందుకు లేరు? మాజీ సెలక్టర్ హాట్ కామెంట్స్
35
ముంబై ఇండియన్స్ నుంచి ఎంపికైన ఆటగాళ్లు ఎవరు?
Image Credit : ANI

ముంబై ఇండియన్స్ నుంచి ఎంపికైన ఆటగాళ్లు ఎవరు?

ముంబై ఇండియన్స్ జట్టులో నుంచి సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యారు. వీరిలో ముగ్గురు ప్లేయర్లు చాల కాలం నుంచి పొట్టి ఫార్మాట్‌లో ఆడుతున్నారు. హార్దిక్ పాండ్యా వన్డే, టీ20లో కీలక ఆటగాడిగా ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా మాత్రం మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టులో నంబర్-1 బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

45
భారత జట్టులో ఐపీఎల్ ప్లేయర్లు
Image Credit : ANI

భారత జట్టులో ఐపీఎల్ ప్లేయర్లు

ముంబై ఇండియన్స్ తర్వాత అధికంగా కోల్ కతా నైట్‌రైడర్స్ నుంచి భారత జట్టులో ఉన్నారు. వారిలో వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, రింకూ సింగ్ ఉన్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ జట్టులో చోటు దక్కించుకున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ నుంచి శివమ్ దూబే, రాయల్ ఛాాలెంజర్స్ బెంగళూరు నుంచి జితేష్ శర్మ ఎంపికయ్యారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి అభిషేక్ శర్మ, పంజాబ్ కింగ్స్ నుంచి అర్షదీప్ సింగ్, గుజరాత్ టైటాన్స్ నుంచి శుభ్ మన్ గిల్, రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్ కూడా ఆసియా కప్ 2025 టీమిండియా స్క్వాడ్‌లో ఉన్నారు.

55
ఐపీఎల్ జట్ల వారీగా టీమిండియాలోని ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే
Image Credit : ANI

ఐపీఎల్ జట్ల వారీగా టీమిండియాలోని ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే

  1. ముంబై ఇండియన్స్ - 4 (సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా)
  2. కోల్ కతా నైట్‌రైడర్స్ - 3 (వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, రింకూ సింగ్)
  3. ఢిల్లీ క్యాపిటల్స్ - 2 (అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్)
  4. గుజరాత్ టైటాన్స్ - 1 (శుభ్మన్ గిల్)
  5. సన్‌రైజర్స్ హైదరాబాద్ - 1 (అభిషేక్ శర్మ)
  6. చెన్నై సూపర్ కింగ్స్ - 1 (శివమ్ దూబే)
  7. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - 1 (జితేష్ శర్మ)
  8. పంజాబ్ కింగ్స్ - 1 (అర్షదీప్ సింగ్)
  9. రాజస్థాన్ రాయల్స్ - 1 (సంజూ శాంసన్)
  10. లక్నో సూపర్ జెయింట్స్ - 0

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ChatGPT Warning : ఏఐలో వీటి గురించి వెతికారా? పోలీసులు మీ ఇంటికొస్తారు.. బీ కేర్‌ఫుల్
Recommended image2
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
Recommended image3
Smartphone: భార‌త మార్కెట్లోకి ఇక‌పై ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Related Stories
Recommended image1
టెన్సర్ G5 చిప్, సూపర్ కూల్ ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ లాంచ్.. ధర ఎంత?
Recommended image2
ఆసియా కప్ 2025: శ్రేయస్‌, జైస్వాల్‌ టీమిండియాలో ఎందుకు లేరు? మాజీ సెలక్టర్ హాట్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved