- Home
- Technology
- Gadgets
- HONOR 600: ఇదేంట్రా బాబూ ఐఫోన్‌కి తాతలా ఉంది.. తక్కువ ధరలోనే కిర్రాక్ ఫీచర్లు
HONOR 600: ఇదేంట్రా బాబూ ఐఫోన్‌కి తాతలా ఉంది.. తక్కువ ధరలోనే కిర్రాక్ ఫీచర్లు
HONOR 600: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ తాజాగా మార్కెట్లోకి ఓ ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. కేవలం లుక్స్‌లోనే కాకుండా పనితీరులో కూడా ఐఫోన్‌కు ధీటుగా దీనిని లాంచ్ చేశారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.?

మిడ్ రేంజ్ ధరలో ఫ్లాగ్‌షిప్ అనుభవం
HONOR సంస్థ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మళ్లీ తన శక్తిని చాటుతోంది. AI టెక్నాలజీ, భారీ బ్యాటరీలు, ప్రీమియం డిజైన్‌లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా HONOR 600, HONOR 600 Pro మోడళ్లను “Accessible Flagship” కాన్సెప్ట్‌తో పరిచయం చేసింది. అంటే ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను తక్కువ ధరలో అందించడమే లక్ష్యం.
కెమెరా సెగ్మెంట్‌లో కొత్త స్టాండర్డ్
ఈ సిరీస్‌లో ముఖ్య ఆకర్షణ కెమెరా సెటప్. 200MP అల్ట్రా క్లియర్ నైట్ కెమెరా పెద్ద సెన్సార్‌తో వస్తుంది. తక్కువ లైట్‌లో కూడా క్లియర్ ఫోటోలు తీసే సామర్థ్యం ఉంటుంది. Pro మోడల్‌లో 50MP టెలిఫోటో లెన్స్‌తో 120x వరకు జూమ్ సపోర్ట్ ఉంది. సాధారణ మోడల్‌లో 30x జూమ్ అందుబాటులో ఉంటుంది. ఏఐ ఇమేజ్ టూ వీడియో 2.0 ఫీచర్ ద్వారా ఫోటోలను వీడియోలుగా మార్చుకోవచ్చు. ఇది సోషల్ మీడియా యూజర్లకు ప్రత్యేకంగా ఉపయోగపడే ఫీచర్.
పనితీరు – గేమింగ్ నుండి డైలీ యూజ్ వరకు
HONOR 600లో Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఇది రోజువారీ వినియోగం, గేమింగ్‌కు సరిపడే పనితీరు ఇస్తుంది. HONOR 600 Proలో Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంది. ఇది ఫ్లాగ్‌షిప్ స్థాయి పనితీరును అందిస్తుంది. హెవీ గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులు సులభంగా చేయవచ్చు.
డిస్‌ప్లే, డిజైన్ ప్రత్యేకతలు
ఈ సిరీస్‌లో AMOLED డిస్‌ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రోల్ స్మూత్‌గా ఉంటుంది. 8000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వల్ల బయట ఎండలో కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. మెటల్ ఫ్రేమ్‌తో పాటు స్లిమ్ డిజైన్ ఇవ్వడం వల్ల ఫోన్ బలంగా, అందంగా ఉంటుంది. IP68, IP69 రేటింగ్స్ వల్ల నీరు, దుమ్ము నుండి రక్షణ ఉంటుంది. ఇక ఈ ఫోన్ లుక్స్ చూడ్డానికి అచ్చంగా ఐఫోన్‌ను పోలి ఉండడం విశేషం.
భారీ బ్యాటరీ
7000mAh బ్యాటరీ ఈ సిరీస్‌లో ప్రధాన బలం. ఒకసారి ఛార్జ్ చేస్తే సులభంగా రెండు రోజులు ఉపయోగించవచ్చు. 80W ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల త్వరగా ఛార్జ్ అవుతుంది. Pro మోడల్‌లో 50W వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. 27W రివర్స్ ఛార్జింగ్ ద్వారా ఇతర డివైజ్‌లను కూడా ఛార్జ్ చేయవచ్చు.
AI ఫీచర్లు – స్మార్ట్ యూజర్ అనుభవం
ఈ ఫోన్లలో AI ఫీచర్లు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. Voice లేదా టెక్స్ట్ కమాండ్స్‌తో ఫోటో ఎడిటింగ్ చేయవచ్చు. Google Gemini ఇంటిగ్రేషన్ వల్ల స్మార్ట్ అసిస్టెంట్ అనుభవం మెరుగ్గా ఉంటుంది. iPhone, Mac డివైజ్‌లతో కూడా ఫైల్ షేరింగ్ సపోర్ట్ ఉంది.
ధరలు ఎలా ఉన్నాయంటే.?
హానర్ 600 సిరీస్ మిడ్ రేంజ్ ప్రీమియం ధరలో అందుబాటులో ఉంది.
* హానర్ 600 (8GB + 256GB) ధర సుమారు రూ. 45,000గా ఉండనుంది.
* హానర్ 600 (12GB + 512GB) ధర సుమారు రూ. 50,000గా ఉంటుంది.
* ఇక హానర్ 600 ప్రో (12GB + 512GB) ధర సుమారు రూ. 75,000గా ఉండనుంది.
ఈ ఫోన్లు ప్రపంచ మార్కెట్‌లో విడుదల అయ్యాయి. భారత మార్కెట్‌లో ఎప్పుడు వస్తాయన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
హానర్ 600కి, 600 ప్రోకి తేడా ఏంటి.?
స్టాండర్డ్ మోడల్ డైలీ యూజ్‌కు సరిపడే పనితీరు, మంచి కెమెరా ఇస్తుంది. Pro మోడల్ మాత్రం ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్, మెరుగైన జూమ్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అదనపు ఫీచర్లతో పవర్ యూజర్లను టార్గెట్ చేస్తుంది. మొత్తం మీద హానర్ 600 సిరీస్ భారీ బ్యాటరీ, 200MP కెమెరా, AI ఫీచర్లతో మార్కెట్‌లో బలమైన పోటీని ఇస్తోంది. మధ్య ధరలో ఫ్లాగ్‌షిప్ అనుభవం కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది.

