- Home
- Technology
- Gadgets
- Amazon: రూ. 30 వేల నుంచి రూ. 50 వేల బడ్జెట్‌లో టాప్ 5 ల్యాప్‌టాప్ డీల్స్.. SBI కార్డ్‌పై భారీ ఆఫర్లు
Amazon: రూ. 30 వేల నుంచి రూ. 50 వేల బడ్జెట్‌లో టాప్ 5 ల్యాప్‌టాప్ డీల్స్.. SBI కార్డ్‌పై భారీ ఆఫర్లు
Best Laptop Deals: అమెజాన్ లో ఫెస్టివ్ సేల్ 2026 లో భాగంగా కళ్లుచెదిరే ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. రూ. 30వేల నుంచి రూ. 50వేల బడ్జెట్‌లో బెస్ట్ ల్యాప్‌టాప్స్ పై అమేజింగ్ డీల్స్ ఉన్నాయి.

స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్.. బంపర్ డిస్కౌంట్లు
ప్రస్తుత రోజుల్లో స్టూడెంట్స్ చదువుకోవాలన్నా, ఆఫీస్ వర్క్ చేసుకోవాలన్నా ప్రొఫెషనల్స్ కు ఒక మంచి ల్యాప్‌టాప్ చాలా అవసరం. కొత్త ల్యాప్‌టాప్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ బడ్జెట్ రూ. 30,000 నుంచి రూ. 50,000 మధ్యలో ఉందా? అయితే మీకోసం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ల్యాప్‌టాప్ డీల్స్ ఇక్కడ ఉన్నాయి.
ఏసర్, ఆసస్, లెనోవో వంటి ప్రముఖ బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లపై ప్రత్యేక ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, కూపన్ డిస్కౌంట్లను ఉపయోగించి ఈ మోడళ్లను అత్యంత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు మీకోసం..
ఏసర్ స్మార్ట్‌ఛాయిస్ ఆస్పైర్ వన్: రూ. 34,990 ఎఫెక్టివ్ ప్రైస్
ఏసర్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ 'Acer Smartchoice Aspire One' ల్యాప్‌టాప్ రోజువారీ పనులు, ఆఫీస్ వర్క్, స్టడీస్ కోసం సరైన ఎంపిక. ఇందులో ఎఎండీ రైజన్ 5-40 ప్రాసెసర్‌ను అందించారు. దాంతో పాటు 8జీబీ ఎల్పీడీడీఆర్ 5 ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. ఇది ఫాస్ట్ పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర కంటే తక్కువగా, కూపన్ డిస్కౌంట్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆఫర్ ఉపయోగించడం ద్వారా కేవలం రూ. 34,990 ఎఫెక్టివ్ ధరకు లభిస్తోంది.
ఏసర్ స్మార్ట్‌ఛాయిస్ ఆస్పైర్ వన్ (Ryzen 5 + MS Office 2024): రూ. 37,990
మీకు ల్యాప్‌టాప్‌తో పాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్ కూడా ముందే ఇన్‌స్టాల్ అయి కావాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్. 'Acer Smartchoice Aspire One' వేరియంట్‌లో AMD Ryzen 5-40 ప్రాసెసర్, 8GB LPDDR5 RAM, 512GB SSD స్టోరేజ్‌తో పాటు ఆఫీస్ 2024 కూడా లభిస్తుంది. ఆఫీస్ వర్క్ చేసేవారికి, స్టూడెంట్స్‌కు ఇది చాలా ఉపయోగపడుతుంది. కూపన్ డిస్కౌంట్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఉపయోగించి ఈ మోడల్‌ను రూ. 37,990 ఎఫెక్టివ్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఆసస్ వివోబుక్ 15 (2026) - Intel Core 3 304: రూ. 41,140 ఎఫెక్టివ్ ప్రైస్
ఆసస్ బ్రాండ్ నుంచి వస్తున్న సరికొత్త మోడల్ 'ASUS Vivobook 15 (2026)'. ఈ ల్యాప్‌టాప్‌లో Intel Core 3 304 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో 8GB RAM, 512GB SSD స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. ల్యాప్‌టాప్ స్క్రీన్ పరిమాణం, డిజైన్, డిస్‌ప్లే క్వాలిటీ చాలా బాగుంటాయి. ఈ ల్యాప్‌టాప్ కొనుగోలుపై ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించడం ద్వారా ఏకంగా రూ. 9,350 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అన్ని డిస్కౌంట్లు పోను దీని ఎఫెక్టివ్ ధర రూ. 41,140 మాత్రమే.
ఆసస్ వివోబుక్ 15 (2026) - Core 3 100U (i3 14th Gen)
కొంచెం మెరుగైన ప్రాసెసింగ్ స్పీడ్ కావాలనుకునే వారి కోసం 'ASUS Vivobook 15 (2026)' Core 3 100U (i3 14th Gen) మోడల్ అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో 8GB RAM, 512GB SSD స్టోరేజ్ అందించారు. లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ కావడంతో మల్టీటాస్కింగ్, స్పీడ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఇఎమ్‌ఐ ద్వారా రూ. 9,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 43,990 ఎఫెక్టివ్ ధరకు సొంతం చేసుకోవచ్చు.
ఏసర్ ఆస్పైర్ వన్ స్మార్ట్‌ఛాయిస్ (AMD Ryzen 3-7320U):
మీ బడ్జెట్ రూ. 30,000 దగ్గరలోనే ఉంటే 'Acer Aspire One Smartchoice' మోడల్ చాలా మంచి ఛాయిస్. ఇందులో AMD Ryzen 3-7320U ప్రాసెసర్ ఉంది. దీనికి తోడు 8GB LPDDR5 RAM, 256GB SSD స్టోరేజ్ అందించారు. తక్కువ బడ్జెట్‌లో ఫాస్ట్ ర్యామ్, ప్రాసెసర్ పొందాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్. ఈ ల్యాప్‌టాప్‌పై రూ. 3,000 ఆఫ్ కూపన్ వర్తిస్తుంది. దాంతో పాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై రూ. 3,750 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రెండు ఆఫర్లు కలిపి ఉపయోగిస్తే ఈ ల్యాప్‌టాప్ రూ. 30,740 ఎఫెక్టివ్ ధరకు లభిస్తుంది.

