MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Football
  • FIFA World Cup: మెస్సీ సేనకు షాక్.. రొనాల్డోనే కింగ్ ! ఘనా మంత్రగాడి మైండ్ బ్లోయింగ్ జోస్యం

FIFA World Cup: మెస్సీ సేనకు షాక్.. రొనాల్డోనే కింగ్ ! ఘనా మంత్రగాడి మైండ్ బ్లోయింగ్ జోస్యం

FIFA World Cup : వరల్డ్ కప్‌లో అర్జెంటీనా ఘోరంగా ఓడిపోతుందని, పోర్చుగల్ కప్ గెలుస్తుందని ఘనా మంత్రగాడు నానా క్వాకు బోన్సామ్ సంచలన జోస్యం చెప్పారు. అతని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 29 2026, 03:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రొనాల్డోకు కప్.. మెస్సీకి షాక్.. గాల్లో తేలుతున్న పోర్చుగల్ అభిమానులు
Image Credit : Getty

రొనాల్డోకు కప్.. మెస్సీకి షాక్.. గాల్లో తేలుతున్న పోర్చుగల్ అభిమానులు

ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026 రసవత్తరంగా సాగుతోంది. మైదానంలో ఆటగాళ్లు చెమటోడుస్తుంటే, బయట మాత్రం చిత్రవిచిత్రమైన జోష్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఘనా దేశానికి చెందిన ప్రముఖ, వివాదాస్పద మంత్రగాడు నానా క్వాకు బోన్సామ్ ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌పై చేసిన తాజా కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రౌండ్ ఆఫ్ 16 నాకౌట్ మ్యాచ్‌లో లియోనెల్ మెస్సీకి చెందిన అర్జెంటీనా జట్టును కేప్ వెర్దె ఓడించి టోర్నమెంట్ నుంచి బయటకు పంపుతుందని ఆయన సంచలన జోస్యం చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మెస్సీ సేనకు కేప్ వెర్దె చెక్ పెడుతుందా?
Image Credit : Getty

మెస్సీ సేనకు కేప్ వెర్దె చెక్ పెడుతుందా?

ఘనాకు చెందిన జోతిష్యుడు నానా క్వాకు బోన్సామ్ అంచనా ప్రకారం.. రౌండ్ ఆఫ్ 16 నాకౌట్ మ్యాచ్‌లో అర్జెంటీనాకు కోలుకోలేని షాక్ తగలనుంది. "నాకౌట్ స్టేజ్‌లో మెస్సీ అర్జెంటీనాను టోర్నమెంట్ నుండి బయటకు పంపే జట్టు కేప్ వెర్దె మాత్రమే" అని కామెంట్స్ చేశారు. జూన్ 4వ తేదీ తెల్లవారుజామున 3:30 గంటలకు అర్జెంటీనా, కేప్ వెర్దె జట్ల మధ్య ఈ కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే గ్రూప్ ఛాంపియన్‌గా నిలిచి అర్జెంటీనా నాకౌట్‌కు దూసుకొచ్చింది.

జోర్డాన్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో మెస్సీ ఫ్రీ-కిక్ గోల్‌తో సహా అర్జెంటీనా 3-1 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో మెస్సీ వరుసగా ఏడు వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు, మిరోస్లావ్ క్లోజ్ వరల్డ్ కప్ గోల్స్ రికార్డును కూడా మెస్సీ బ్రేక్ చేశాడు. ప్రస్తుతం 6 గోల్స్‌తో మెస్సీ గోల్డెన్ బూట్ రేసులో ముందున్నాడు. ఇలాంటి ఫామ్‌లో ఉన్న మెస్సీ జట్టు ఓడిపోతుందని చెప్పడం అభిమానులకు షాక్ ఇస్తోంది.

36
క్రిస్టియానో రొనాల్డోనే రియల్ కింగ్
Image Credit : Getty Images, X

క్రిస్టియానో రొనాల్డోనే రియల్ కింగ్

అర్జెంటీనా ఓడిపోతుందని చెప్పడమే కాకుండా, ఈసారి 2026 ఫిఫా వరల్డ్ కప్‌ను క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ జట్టు గెలుచుకుంటుందని బోన్సామ్ బోల్డ్ ప్రిడిక్షన్ ఇచ్చారు. ఫుట్‌బాల్ మైదానం కంటే ముందే ఆధ్యాత్మిక ప్రపంచంలో పోర్చుగల్ విజయం ఖరారైపోయిందని ఆయన వాదిస్తున్నారు. "ఈ వరల్డ్ కప్ పోర్చుగల్, క్రిస్టియానో రొనాల్డోదే. వాళ్లే కప్ కొడతారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో వాళ్లు ఇప్పటికే గెలిచేశారు. రొనాల్డో నమ్మకంగా ఉండొచ్చు, ఎందుకంటే అతని సమయం వచ్చేసింది" అని బోన్సామ్ చెప్పుకొచ్చారు.

46
హ్యారీ కేన్‌పై మంత్రవిద్యలు
Image Credit : Getty

హ్యారీ కేన్‌పై మంత్రవిద్యలు

నానా క్వాకు బోన్సామ్ కేవలం ప్రవచనాలకే పరిమితం కాలేదు. అంతకుముందు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్‌ను టార్గెట్ చేసి వార్తల్లో నిలిచారు. ఘనాతో జరిగిన మ్యాచ్‌లో హ్యారీ కేన్ గోల్ చేయకుండా ఉండేందుకు తాను మంత్రాలను ఉపయోగించానని ఆయన చెప్పారు. మ్యాచ్‌కు ముందు ‘డైలీ స్టార్’ పత్రికతో మాట్లాడుతూ.. "నా పవర్ ఏంటో నాకు తెలుసు, అతన్ని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు" అని అన్నారు. ఇంగ్లాండ్, ఘనా మ్యాచ్ గోల్స్ లేకుండా డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో హ్యారీ కేన్ వచ్చిన మంచి అవకాశాలను కూడా మిస్ చేసుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో బోన్సామ్ కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి.

56
హ్యారీ కేన్ నా శత్రువు కాదు..
Image Credit : Getty

హ్యారీ కేన్ నా శత్రువు కాదు..

అయితే, ఇంగ్లాండ్ కెప్టెన్‌పై తనకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని బోన్సామ్ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. "హ్యారీ కేన్ నా శత్రువు ఏమీ కాదు. త్వరలోనే నా పుట్టబోయే బిడ్డకు హ్యారీ కేన్ అని పేరు పెడతాను" అని అన్నారు. అంతేకాదు, హ్యారీ కేన్‌ను తన మంత్రాల నుండి విడుదల చేస్తున్నానని, తర్వాతి మ్యాచ్‌లో అతను గోల్స్ చేయవచ్చని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.

66
ఎవరీ నానా క్వాకు బోన్సామ్?
Image Credit : Facebook/Nana Kwaku Bonsam

ఎవరీ నానా క్వాకు బోన్సామ్?

ఘనా దేశంలో నానా క్వాకు బోన్సామ్ అత్యంత వివాదాస్పద పబ్లిక్ ఫిగర్. అక్రా నగరంలో మూడు ఆధ్యాత్మిక కేంద్రాలను నడుపుతున్న ఆయన, తనను తాను ఆఫ్రికన్ సాంప్రదాయ పూజారిగా, హెర్బలిస్ట్‌గా చెప్పుకుంటారు. 1992లో గ్యాస్ సిలిండర్ పేలి తీవ్రంగా గాయపడిన తర్వాత ఆయన ఈ ఆధ్యాత్మిక, మంత్రవిద్యల వైపు తిరిగారు. ఘనా స్థానిక నమ్మకాలు, సాంప్రదాయ పద్ధతులను అనుసరించే ఆయనకు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది.

గతంలో 2014 ఫిఫా వరల్డ్ కప్‌లో కూడా ఘనాతో మ్యాచ్‌కు ముందు క్రిస్టియానో రొనాల్డో గాయపడటానికి తానే కారణమని క్లెయిమ్ చేసి ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ ఆధ్యాత్మిక నమ్మకాలకు ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేకపోయినా, సోషల్ మీడియా యుగంలో ఫుట్‌బాల్ లవర్స్ మాత్రం ఈ అంచనాల పై తెగ చర్చించుకుంటున్నారు. మరి మెస్సీని ఓడించి రొనాల్డో కప్ కొడతాడో లేదో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
FIFA ప్రపంచ కప్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image2
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Recommended image3
India Vs Brazil: భారత ఫుట్‌బాల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మ్యాచ్.. బ్రెజిల్‌తో తలపడనున్న టీమిండియా
Related Stories
Recommended image1
Monsoon Travel 2026: లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిందే.. ఇండియాలోని టాప్ 6 మన్సూన్ వాటర్ ఫాల్స్ ఇవే !
Recommended image2
ATM PIN : ఏటీఎం పిన్ 4 అంకెలే ఎందుకు ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన స్టోరీ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved