MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Football
  • FIFA World Cup 2026: బాబోయ్ ఏం మ్యాచ్ రా నాయనా ! ఫ్రాన్స్‌ను రౌండప్ చేసి కొట్టిన ఇంగ్లాండ్.. మెస్సీ రికార్డ్ బ్రేక్

FIFA World Cup 2026: బాబోయ్ ఏం మ్యాచ్ రా నాయనా ! ఫ్రాన్స్‌ను రౌండప్ చేసి కొట్టిన ఇంగ్లాండ్.. మెస్సీ రికార్డ్ బ్రేక్

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 థర్డ్ ప్లేస్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ను 6-4తో ఇంగ్లాండ్ ఓడించింది. సాకా హాట్రిక్ కొట్టగా, ఎంబాప్పే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఫ్రాన్స్‌ను రౌండప్ చేసి కొట్టింది ఇంగ్లాండ్.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 19 2026, 07:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మయామిలో గోల్స్ జాతర.. ఫ్రాన్స్‌ను ఊచకోత కోసిన ఇంగ్లాండ్
Image Credit : Asianet News

మయామిలో గోల్స్ జాతర.. ఫ్రాన్స్‌ను ఊచకోత కోసిన ఇంగ్లాండ్

ఫుట్‌బాల్ హిస్టరీలోనే మోస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ ఫిఫా వరల్డ్ కప్ 2026లో జరిగింది. ఆదివారం థర్డ్ ప్లేస్ కోసం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ జట్లు మైదానంలో పూనకాలు వచ్చినట్లు ఊగిపోయాయి. మయామిలోని హార్డ్ రాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 10 గోల్స్ నమోదయ్యాయి.

హోరాహోరీగా సాగిన ఈ గోల్స్ పండగలో ఇంగ్లాండ్ 6-4 తేడాతో ఫ్రాన్స్‌ను చిత్తు చేసి బ్రాంజ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బుకాయో సాకా సూపర్ హాట్రిక్‌తో మ్యాచ్‌ను వన్‌సైడ్ చేయగా, ఫ్రాన్స్ కెప్టెన్ ఎంబాప్పే డబుల్ గోల్స్ కొట్టినా తన టీమ్‌ను గెలిపించుకోలేకపోయాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
60 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇంగ్లాండ్ హిస్టారికల్ రికార్డ్
Image Credit : Asianet News

60 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇంగ్లాండ్ హిస్టారికల్ రికార్డ్

ఈ విజయంతో ఇంగ్లాండ్ ఒక భారీ రికార్డ్‌ను సెట్ చేసింది. 1966లో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, మళ్లీ 60 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఇంగ్లాండ్ టీమ్ ఒక వరల్డ్ కప్‌లో టాప్ 3లో ఫినిష్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. హ్యారీ కేన్ కెప్టెన్సీలోని ఇంగ్లాండ్ టీమ్ వరల్డ్ కప్ కల చెదిరిపోయినా, ఈ బ్రాంజ్ మెడల్ గెలవడం వాళ్లకు చాలా పెద్ద అచీవ్‌మెంట్ అని చెప్పాలి. మరోవైపు, ఈ టోర్నమెంట్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్‌కు మాత్రం తీవ్ర నిరాశే మిగిలింది. వాళ్లు కనీసం థర్డ్ ప్లేస్ కూడా దక్కించుకోలేక చతికిలపడ్డారు.

35
సాకా హాట్రిక్ షాట్స్.. డెక్లాన్ రైస్ ఫస్ట్ పంచ్
Image Credit : Getty

సాకా హాట్రిక్ షాట్స్.. డెక్లాన్ రైస్ ఫస్ట్ పంచ్

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తరఫున 25 ఏళ్ల బుకాయో సాకా మెరుపులు మెరిపించాడు. మ్యాచ్‌ 37వ, 45+1వ, 87వ నిమిషాల్లో అదిరిపోయే గోల్స్ కొట్టి హాట్రిక్ కంప్లీట్ చేశాడు. అయితే మ్యాచ్ స్టార్ట్ అయిన 3వ నిమిషంలోనే డెక్లాన్ రైస్ గోల్ కొట్టి ఇంగ్లాండ్‌కు అదిరిపోయే లీడ్ ఇచ్చాడు. ఆ తర్వాత 18వ నిమిషంలో ఎజ్రీ కొన్సా ఇంకో గోల్ వేయడంతో లీడ్ డబుల్ అయింది. ఇక సాకా బ్యాక్ టు బ్యాక్ గోల్స్ కొట్టడంతో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి ఇంగ్లాండ్ 4-0తో ఫుల్ డామినేషన్ చూపించింది. ఫ్రాన్స్ టీమ్ అసలు కోలుకోలేదేమో అనుకున్నారంతా.. కానీ, మళ్లీ ఫ్రాన్స్ కూడా గోల్స్ కొట్టడం స్టార్ట్ చేయడంతో ఉత్కంఠగా సాగింది.

45
సెకండ్ హాఫ్‌లో ఫ్రాన్స్ మాస్ కమ్‌బ్యాక్.. నరాలు తెగే ఉత్కంఠ
Image Credit : Getty

సెకండ్ హాఫ్‌లో ఫ్రాన్స్ మాస్ కమ్‌బ్యాక్.. నరాలు తెగే ఉత్కంఠ

కానీ సెకండ్ హాఫ్‌లో సీన్ రివర్స్ అయింది. ఫ్రాన్స్ టీమ్ ఊహించని రేంజ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చింది. 48వ నిమిషంలో ఎంబాప్పే ఫస్ట్ గోల్ కొట్టాడు. ఆ వెంటనే 54వ నిమిషంలో బ్రాడ్లీ బార్కోలా ఇంకో గోల్ వేసి స్కోర్‌ను 2-4కి తెచ్చాడు. 66వ నిమిషంలో ఎంబాప్పే మళ్లీ మ్యాజిక్ చేస్తూ సెకండ్ గోల్ కొట్టడంతో లీడ్ 4-3కి పడిపోయింది. మ్యాచ్ లాస్ట్ మినిట్స్‌కు వచ్చేసరికి ఉత్కంఠ పీక్స్‌కు చేరింది. 87వ నిమిషంలో ఇంగ్లాండ్‌కు పెనాల్టీ దక్కగా, సాకా దాన్ని గోల్‌గా మార్చి తన హాట్రిక్‌తో పాటు స్కోర్‌ను 5-3 చేశాడు. ఇంజూరీ టైమ్ 90+6వ నిమిషంలో ఉస్మాన్ డెంబెలే ఫ్రాన్స్ తరఫున 4వ గోల్ కొట్టి ఆశలు రేపాడు. కానీ 90+8వ నిమిషంలో జూడ్ బెల్లింగ్‌హామ్ ఇంగ్లాండ్ తరఫున సిక్స్త్ గోల్ కొట్టి మ్యాచ్‌ను క్లోజ్ చేసేశాడు.

55
మెస్సీ రికార్డ్ బ్రేక్.. కింగ్ లాగా నిలిచిన ఎంబాప్పే
Image Credit : Getty

మెస్సీ రికార్డ్ బ్రేక్.. కింగ్ లాగా నిలిచిన ఎంబాప్పే

మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఓడిపోయినా, ఆ టీమ్ కెప్టెన్ ఎంబాప్పే మాత్రం హిస్టరీ క్రియేట్ చేశాడు. 27 ఏళ్ల ఈ ఫుట్‌బాల్ సెన్సేషన్ ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ కొట్టడం ద్వారా ఈ సీజన్‌లో టోటల్‌గా 10 గోల్స్ పూర్తి చేశాడు. దాంతో మెస్సీ (8 గోల్స్)ని దాటేసి గోల్డెన్ బూట్ రేసులో టాప్‌లోకి దూసుకెళ్లాడు. అంతేకాదు, వరల్డ్ కప్ హిస్టరీలోనే అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా ఎంబాప్పే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఎంబాప్పే ఖాతాలో ఇప్పుడు మొత్తం 22 వరల్డ్ కప్ గోల్స్ ఉన్నాయి. మెస్సీ 21 గోల్స్‌తో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. మ్యాచ్ ఓడినా ఎంబాప్పే మాత్రం రియల్ కింగ్ అనిపించుకున్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
FIFA ప్రపంచ కప్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st T10 • ABDT10
UABUAB
Sat, 7 Nov, 2026
YASLYASL
05:00 pm
Match yet to begin.
Schedule ›
2nd T10 • ABDT10
RDCRDC
Sat, 7 Nov, 2026
EEEE
07:15 pm
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
UNTUNT
Sat, 7 Nov, 2026
ARACARAC
09:30 pm
Match yet to begin.
Schedule ›
4th T10 • ABDT10
YASLYASL
Sun, 8 Nov, 2026
EEEE
05:00 pm
Match yet to begin.
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image2
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Recommended image3
India Vs Brazil: భారత ఫుట్‌బాల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మ్యాచ్.. బ్రెజిల్‌తో తలపడనున్న టీమిండియా
Related Stories
Recommended image1
FIFA World Cup prize: ఫిఫా కప్ కొడితే లైఫ్ సెటిల్.. మతిపోయే ప్రైజ్ మనీ.. గ్రూప్ స్టేజ్‌లోనే ఓడినా 100 కోట్లు !
Recommended image2
FIFA World Cup Final: 5 ఏళ్ల క్రితమే ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ ఫలితం లీక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved