- Home
- Sports
- Football
- FIFA World Cup prize: ఫిఫా కప్ కొడితే లైఫ్ సెటిల్.. మతిపోయే ప్రైజ్ మనీ.. గ్రూప్ స్టేజ్‌లోనే ఓడినా 100 కోట్లు !
FIFA World Cup prize: ఫిఫా కప్ కొడితే లైఫ్ సెటిల్.. మతిపోయే ప్రైజ్ మనీ.. గ్రూప్ స్టేజ్‌లోనే ఓడినా 100 కోట్లు !
FIFA Prize Money: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరుకు అర్జెంటీనా, స్పెయిన్ సిద్ధమయ్యాయి. అయితే, ఫిఫా ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. గ్రూప్ స్టేజ్‌లో వెనుదిరిగినా రూ.110 కోట్లు గ్యారెంటీ.. మరి విజేత, రన్నరప్ టీమ్స్ ఎంత అందుకుంటాయి?

ఫిపా వరల్డ్ కప్ విన్నర్ కు ఇన్ని వందల కోట్లా..రికార్డు స్థాయి ప్రైజ్ మనీ
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రీడా పండుగ ‘ఫిఫా ప్రపంచ కప్ 2026’కు సంబంధించి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ మెగా టోర్నమెంట్‌లో విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ ఊహించని రేంజ్‌కు చేరింది. ఈసారి ఫిఫా ఏకంగా 871 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు ₹83,934 కోట్ల భారీ మోత్తాన్ని అధికారికంగా ప్రకటించింది. గతంలో 2022లో ఖతార్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో మొత్తం బడ్జెట్ 440 మిలియన్ డాలర్లు మాత్రమే కాగా.. ఈసారి ఏకంగా 65 శాతం పెంచి సరికొత్త రికార్డు సృష్టించారు.
ఈ భారీ నిధిలో నుంచి సుమారు 655 మిలియన్ డాలర్లను పూర్తిగా ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్లకు పంచనున్నారు. మిగిలిన నిధులను టీమ్స్ క్వాలిఫికేషన్ పేమెంట్లు, వరల్డ్ కప్ ప్రిపరేషన్స్ ఖర్చుల కోసం కేటాయించారు. అంటే ఈసారి మైదానంలో దిగిన ప్రతి జట్టూ కోటీశ్వరులవడమే కాకుండా, వారి దేశాల ఫుట్‌బాల్ అసోసియేషన్లకు కాసుల వర్షం కురవడం ఖాయమైంది.
విజేతకు ఏకంగా రూ.480 కోట్లు పైమాటే
మరి ఈ రికార్డ్ బ్రేకింగ్ బడ్జెట్‌లో కప్ కొట్టే అసలైన విజేతకు ఎంత దక్కనుందో తెలుసా? టోర్నమెంట్‌లో ఛాంపియన్‌గా నిలిచే జట్టుకు ప్రదర్శన ఆధారంగానే ఏకంగా 50 మిలియన్ డాలర్లు (సుమారు ₹4,818 కోట్లు) లభిస్తుంది. దీనికి తోడు ప్రిపరేషన్ ఖర్చులు, క్వాలిఫికేషన్ అలొవెన్సులు కూడా కలుపుకుంటే.. విన్నింగ్ టీమ్ అందుకునే మొత్తం మనీ ఏకంగా 53.5 మిలియన్ డాలర్ల (సుమారు ₹5,155 కోట్లు) వరకు చేరుకుంటుంది.
గత 2022 వరల్డ్ కప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన అర్జెంటీనాకు అప్పట్లో 42 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. దానితో పోలిస్తే ఈసారి ఏకంగా 8 మిలియన్ డాలర్ల (సుమారు ₹77 కోట్లు) భారీ అదనపు ప్రైజ్ మనీ విజేతకు దక్కబోతోంది. ఇక రన్నరప్‌గా నిలిచే (సెకండ్ ప్లేస్) టీమ్‌కు కూడా ఏమీ తక్కువ కాకుండా 33 మిలియన్ డాలర్ల (సుమారు ₹3,180 కోట్లు) ప్రదర్శన బహుమతి అందుతుంది. ఇది గత టోర్నీతో పోలిస్తే 3 మిలియన్ డాలర్లు ఎక్కువ.
గ్రూప్ స్టేజ్ లో వెనుదిరిగినా వంద కోట్లు
ఈసారి ఫిఫా వరల్డ్ కప్‌లో జరిగిన అతిపెద్ద మార్పు ఏమిటంటే.. టోర్నీలో పాల్గొనే జట్ల సంఖ్యను 48కి పెంచారు. మైదానంలో దిగే ప్రతి దేశం తమ తొలి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లలో ఓడిపోయి వెనుదిరిగినా సరే భారీ నజరానాతో ఇంటికి వెళ్లే ఛాన్స్ లభించింది. గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించే జట్లకు (33 నుండి 48 స్థానాల వరకు) కూడా ఒక్కొక్క టీమ్‌కు 9 మిలియన్ డాలర్ల (సుమారు ₹86.7 కోట్లు) ప్యూర్ పెర్ఫార్మెన్స్ బోనస్ లభిస్తుంది.
దీనికి తోడు ప్రతీ క్వాలిఫైడ్ దేశానికి ఫిఫా అదనంగా 2.5 మిలియన్ డాలర్ల (సుమారు ₹24 కోట్లు) ప్రిపరేషన్ ఫీజును ముందే చెల్లించింది. అంటే టోర్నీకి క్వాలిఫై అయిన ఏ జట్టుకైనా మినిమం గ్యారెంటీ ప్రైజ్ మనీ 12.5 మిలియన్ డాలర్లు (సుమారు ₹120 కోట్లు) నేరుగా వారి జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ల ఖాతాల్లో జమ అవుతుందని అర్థం.
ఫుట్‌బాల్ బోర్డులకు లక్కీ ఆఫర్
ఈ కేటాయింపులపై ఫిఫా ఇప్పటికే పూర్తి క్లారిటీ ఇచ్చింది. పెర్ఫార్మెన్స్ ఆధారంగా వచ్చే ప్రైజ్ మనీతో పాటు ప్రిపరేషన్ బడ్జెట్‌ను నేరుగా ఆయా దేశాల అధికారిక ఫుట్‌బాల్ అసోసియేషన్లకు పంపడం జరుగుతుంది. పెరిగిన ప్రైజ్ మనీ వల్ల చిన్న చిన్న దేశాల క్రీడా బోర్డులకు కూడా వందల కోట్ల భారీ ఆదాయం చేకూరనుంది. ఇది ఆయా దేశాల్లో ఫుట్‌బాల్ క్రీడా మౌలిక వసతులను మెరుగుపరచడానికి, యువ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఫిఫా పేర్కొంది. ఏదేమైనా 2026 ఫిఫా వరల్డ్ కప్ కేవలం మ్యాచ్‌ల పరంగానే కాకుండా, మనీ పరంగా కూడా హిస్టరీ క్రియేట్ చేస్తోంది.
ఫిఫా వరల్డ్ కప్ 2026 : స్టేజ్ వారీగా ప్రైజ్ మనీ పూర్తి వివరాలు
• ఛాంపియన్స్ : కప్ కొట్టిన టీమ్‌కు కేవలం ఆట ప్రదర్శన కోసమే $50 మిలియన్లు (సుమారు ₹481.8 కోట్లు) లభిస్తాయి. సన్నద్ధత ఫీజుతో కలిపి మొత్తం $52.5 మిలియన్లు (సుమారు ₹505.9 కోట్లు) జేబులో పడతాయి.
• రన్నర్స్-అప్ : ఫైనల్లో ఓడిన జట్టుకు $33 మిలియన్ల ప్రైజ్ మనీ దక్కుతుంది. సన్నద్ధత ఫీజు కూడా యాడ్ చేసుకుంటే మొత్తం $35.5 మిలియన్లు (సుమారు ₹342.1 కోట్లు) వస్తాయి.
• 3వ స్థానం: మూడో స్థానంలో నిలిచే టీమ్‌కు $29 మిలియన్ల బహుమతి లభిస్తుంది. ప్రిపరేషన్ ఫీజుతో కలిపి ఈ మొత్తం $31.5 మిలియన్లు (సుమారు ₹303.5 కోట్లు) అవుతుంది.
• 4వ స్థానం: నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న జట్టుకు $27 మిలియన్లు వస్తాయి. టోటల్‌గా సన్నద్ధత ఫీజుతో కలిపి వీరు $29.5 మిలియన్లు (సుమారు ₹284.2 కోట్లు) అందుకుంటారు.
• క్వార్టర్ ఫైనలిస్ట్‌లు (5 నుండి 8 స్థానాలు): ఈ స్టేజ్‌లో నిష్క్రమించే నాలుగు జట్లకు తలో $19 మిలియన్లు వస్తాయి. సన్నద్ధత ఫీజుతో కలిపి ప్రతీ టీమ్‌కు మొత్తం $21.5 మిలియన్లు (సుమారు ₹207.1 కోట్లు) లభిస్తాయి.
• రౌండ్ ఆఫ్ 16 (9 నుండి 16 స్థానాలు): ఈ గ్రూప్‌లోని 8 జట్లకు ఒక్కొక్కదానికి $15 మిలియన్లు దక్కుతాయి. ప్రిపరేషన్ ఫీజు కలిపితే ఒక్కో జట్టుకు $17.5 మిలియన్లు (సుమారు ₹168.6 కోట్లు) వస్తాయి.
• రౌండ్ ఆఫ్ 32 (17 నుండి 32 స్థానాలు): ఇక్కడ అవుట్ అయ్యే 16 జట్లకు తలో $11 మిలియన్లు వస్తాయి. సన్నద్ధత ఫీజుతో కలిపి వీరికి మొత్తం $13.5 మిలియన్లు అందుతాయి.
• గ్రూప్ స్టేజ్ నిష్క్రమణ (33 నుండి 48 స్థానాలు): టోర్నీ ప్రారంభంలోనే వెనుదిరిగే చివరి 16 జట్లకు కూడా తలో $9 మిలియన్ల భారీ బోనస్ లభిస్తుంది. ప్రిపరేషన్ ఫీజుతో కలిపితే ఒక్కో దేశానికి గ్యారెంటీగా $11.5 మిలియన్లు (సుమారు ₹110.8 కోట్లు) వస్తాయి.
