ఉదయాన్నే వీటిని మాత్రం తినకండి, ఎందుకో తెలుసా?
హెల్దీ ఫుడే కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తిన్నా కూడా ఆరోగ్య సమస్యలు వచ్చేస్తాయట. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను ఉదయాన్నే పరగడుపున అస్సలు తినకూడదు. అవేంటో ఓసారి చూసేద్దామా...

eating food
మనం ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నాం అనేది ఎంత ముఖ్యమో... ఆ ఫుడ్ ని ఏ టైమ్ లో తీసుకుంటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. అది చాలా అవసరం కూడా. అలా కాకుండా.. హెల్దీ ఫుడే కదా అని ఎప్పుడు పడితే అప్పుడు తిన్నా కూడా ఆరోగ్య సమస్యలు వచ్చేస్తాయట. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను ఉదయాన్నే పరగడుపున అస్సలు తినకూడదు. అవేంటో ఓసారి చూసేద్దామా...
Citrus Fruits
1.సిట్రస్ పండ్లు...
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా సిట్రస్ పండ్లు మరింత మంచి చేస్తాయి. ఎందుకంటే వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మన ఆరోగ్యానికి, అందం పెరగడానికి సహాయపడుతుంది. కానీ, ఈ పండ్లను పరగడుపున మాత్రం అస్సలు తినకూడదు. ఖాళీ కడుపుతో తినడం వల్ల కడుపులో ఎసిడిటీ సమస్య ఏర్పడుతుంది. గుండెల్లో మంటకు కూడా కారణం అవుతుంది. జీర్ణ సమస్యలు రావడం మొదలౌతాయి. అందుకే, వీటిని మాత్రం పరగడుపున తినకూడదు.
ఎక్కువ కారంగా ఉండే ఫుడ్స్....
ఉదయాన్నే ముఖ్యంగా పరగడుపున కారం ఎక్కువగా ఉండే ఆహారాలు తినకూడదు. అవి కడుపులో మంటకు కారణం అవుతాయి. కడుపులో అసౌకర్యానికి గురి చేస్తాయి. జీర్ణ సమస్యలు రావడానికి కారణం అవుతాయి. అచ్చంగా కారంగా ఉండేవి కాకుండా.. ఇతర ఫుడ్స్ తో కలిపి తీసుకోవడం మంచిది.
కాఫీ:
ఉదయం లేవగానే వేడి వేడిగా ఒక కప్పు కాఫీ తాగితే ఆ ఫీల్ ఎంత బాగుంటుందో కదా. కానీ, పరగడుపున కాఫీ అస్సలు తాగకూడదు.ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల ఆమ్లత్వం పెరుగుతుందని , విరేచనాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్రేక్ ఫాస్ట్ చేసి కాఫీ తాగడం మంచి అలవాటు.
చక్కెర అధికంగా ఉండే ఆహారాలు:
కేకులు, పేస్ట్రీలు, డోనట్స్, చక్కెర అధికంగా ఉండే తృణధాన్యాలు వంటి చక్కెర అధికంగా ఉండే ఆహారాలను ఖాళీ కడుపుతో తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. వీటి వల్ల ఆకలి మరింత పెరుగుతుంది. కాబట్టి ఉదయం పండ్లు లేదా ఎండిన గింజలు వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఉత్తమం.
కార్బోనేటేడ్ పానీయాలు:
సోడా , పెప్సి కోక్ వంటి కార్బోనేటేడ్ పానీయాలు ఖాళీ కడుపుతో తీసుకుంటే ఉబ్బరం , గ్యాస్‌కు కారణమవుతాయి. జీర్ణక్రియకు సహాయపడటానికి, అసౌకర్యాన్ని నివారించడానికి ఆహారంతో పాటు వాటిని త్రాగడం ఉత్తమం.