నిమ్మకాయతో ఈ ఆహారాలను పొరపాటున కూడా తినకండి.. ఒకవేళ తిన్నారో మీ పని అంతే..!
పోషకాలు పుష్కలంగా ఉండే నిమ్మకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిమ్మలో ఉండే ఔషద గుణాలు మనల్నిఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. నిమ్మకాయలో మన ఇమ్యూనిటీ పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయను కొన్ని ఆహారాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
నిమ్మకాయలను ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తారు. సలాడ్లు, కూరగాయలు, కాయధాన్యాలు మొదలైన వాటిలో నిమ్మకాయను తీసుకుంటారు. ఇది ఫుడ్ ను టేస్టీగా చేస్తుంది. అంతేకాదు మన ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మకాయల్లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుది. అలాగే కాల్షియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు కూడా దీనిలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. నిమ్మలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. నిమ్మకాయ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా.. వీటిని కొన్ని ఆహారాలతో కలిపి అసలే తినకూడదు. ఎందుకంటే ఇది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు వచ్చేలా చేస్తుంది. మరి నిమ్మకాయతో ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
పాల ఉత్పత్తులు
నిమ్మకాయల్లో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. ఇది పాలు లేదా ఇతర పాల ఉత్పత్తులతో చర్య జరుపుతుంది. అంతేకాకుండా దీని వినియోగం ఆమ్ల ప్రతిచర్యకు కారణమవుతుంది. దీంతో గుండెల్లో మంట, కడుపులో గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.
స్పైసీ ఫుడ్
నిమ్మకాయ ఆమ్లంగా ఉంటుంది. ఇది ఈ మసాలా ఆహారాన్ని కారంగా, పుల పుల్లగా చేస్తుంది. దీంతో స్పైసీ ఫుడ్ రుచి పాడవుతుంది. అందుకే నిమ్మకాయలను స్పైసీ ఫుడ్ కు ఉపయోగించకండి.
రెడ్ వైన్
నిమ్మకాయను రెడ్ వైన్ తో పాటు తీసుకోకూడదు. ఎందుకంటే నిమ్మకాయల్లోని ఆమ్ల స్వభావం రెడ్ వైన్ రుచిని పాడు చేస్తుంది. అంతేకాకుండా రెడ్ వైన్ ఉన్న పదార్థాలతో నిమ్మకాయ తినకూడదని నిపుణులు అంటున్నారు.
సీఫుడ్
ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది నిమ్మకాయను చేపలతో తింటుంటారు. టేస్ట్ కోసం ఇలా చేస్తుంటారు. కానీ నిమ్మకాయను సీఫుడ్ ముఖ్యంగా రుచిగల చేపలతో నివారించాలని నిపుణులు చెబుతున్నారు. ఇది వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
lemon
తీయని పండ్లు
నిమ్మకాయ పుల్లని రుచిని, ఆకృతిని కలిగి ఉంటుంది. దీనిలో ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ.. వీటిని తీయని పండ్లతో తీనకూడదు. ఎందుకంటే ఆ పండ్ల రుచి చెడిపోతుంది. ఉదాహరణకు.. నిమ్మకాయను స్ట్రాబెర్రీలు లేదా పుచ్చకాయతో తినకూడదు.
Image: Freepik
మజ్జిగ, పెరుగు
నిమ్మరసం.. పాలు, మజ్జిగ, పెరుగు పగిలిపోవడానికి కారణమవుతుంది. మీరు ఈ పదార్థాలను కలపాలనుకుంటే.. నెమ్మదిగా, సరిగ్గా కలపడం మంచిది.