MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Food
  • ఇందుకే రోజూ చికెన్ ను తినొద్దంటరు

ఇందుకే రోజూ చికెన్ ను తినొద్దంటరు

నిజానికి చికెన్ మంచి పోషకాహారం. దీన్ని తింటే మన శరీనాకి ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. అయినప్పటికీ.. చికెన్ ను రోజూ తినడం మంచిది కాదు.  

2 Min read
Author : R Shivallela
Published : Sep 25 2023, 01:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చికెన్ ను ఇష్టపడనివారంటూ ఉండరు. చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ 65 అంటూ ఎన్నో రకాలుగా చికెన్ ను తినొచ్చు. నిజానికి చికెన్ ను ఏ విధంగా తిన్నా అదిరిపోతుంది. అంతేకాదు చికెన్ మన శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుంది. చికెన్ లో ప్రోటీన్, సెలీనియం, ఫాస్పరస్, నియాసిన్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చికెన్ లో ప్రోటీన్లను తయారు చేయడానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రోటీన్లు హార్మోన్లు, రోగనిరోధక కణాల ఉత్పత్తిలో సహాయపడతాయి. అలాగే ఇవి కండరాల పెరుగుదలను కూడా మెరుగుపరుస్తాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Chicken 65

Chicken 65

చికెన్ మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందించినా.. దీన్ని రోజూ తినడం మంచిది కాదు. ఎందుకంటే దీన్ని ఎక్కువగా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. చికెన్ ను ఎక్కువగా తినడం వల్ల మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. అంతేకాదు గుండె జబ్బులు కూడా వస్తాయి. మీకు తెలుసా? మనం మన రోజువారీ కేలరీలను తీసుకోవడంలో ప్రోటీన్ 10 నుంచి 35 శాతం మాత్రమే ఉండాలి. ఇంతకంటే ఎక్కువ ప్రోటీన్ ను తీసుకుంటే మన శరీరం దానిని కొవ్వుగా నిల్వ చేస్తుంది. దీనివల్ల మీరు బరువు పెరుగుతారు. అలాగే మీ శరీరంలో కొలెస్ట్రాల్ కూడా బాగా పెరిగిపోతుంది. 
 

35

రెగ్యులర్ గా కోడి మాంసం తినడం వల్ల మీ శరీరంలో ప్రోటీన్లు పెరిగిపోతాయి. ఎక్కువ ప్రోటీన్ అరగడం కష్టం. మీకు తెలుసా?చికెన్ ను ఎక్కువగా తినడం వల్ల మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ బాగా పెరిగిపోతాయి. ఇది గండెపోటుతో పాటుగా ఇతర గుండె జబ్బులను కలిగిస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే చికెన్ లేదా ఇతర ఆహారాలను తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 

45

చికెన్ వంటి జంతు ఆధారిత ప్రోటీన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు బరువు తగ్గడం కష్టమవుతుంది. శాకాహారులతో పోలిస్తే రోజూ కోడి మాంసం తినేవారిలో బీఎంఐ ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
 

55
Image: Getty

Image: Getty

చికెన్ సరిగ్గా ఉడకకపోతే దీనిలో సాల్మొనెల్లా లేదా క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టీరియా బయటకు రావొచ్చు. ఈ బ్యాక్టీరియా మన శరీరంపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇవి ఎన్నో ప్రమాదకరమైన రోగాకలు దారితీస్తాయి. వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు వంటి బలహీనమైన వ్యక్తులు సరిగ్గా ఉడకని చికెన్ ను అసలే తినకూడదు. 
 

About the Author

RS
R Shivallela
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved