అన్నాన్ని ఎలా వేడి చేయాలో తెలుసా?
అన్నం వేడి చేయడం మంచిదేనా? వేడి చేసిన అన్నం తినడం వల్ల మనకు ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...

ఇండియన్స్ అందరూ భోజనంగా ప్రతిరోజూ అన్నమే తీసుకుంటూ ఉంటారు. కొందరు రోటీ తీసుకున్నా.. ఎక్కువ మంది తినేది అన్నమే. రైస్ తోనూ చాలా రకాల వంటలు చేసుకోవచ్చు.పప్పన్నం నుంచి.. ఫ్రైడ్ రైస్, బిర్యానీ వరకు ఏది చేయాలన్నా రైస్ కావాల్సిందే. అయితే... మనం వండిన అన్నం మిగిలిపోయిన తర్వాత చాలా మంది వేడి చేసుకుంటూ ఉంటారు. కానీ.. అన్నం వేడి చేయడం మంచిదేనా? వేడి చేసిన అన్నం తినడం వల్ల మనకు ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...
ఒక్కోసారి ఎక్కువ అన్నం వండటం వల్ల మిగిలిపోతూ ఉంటుంది. అలా మిగిలిపోయిన అన్నాన్ని తిన్నా ఏమీ కాదు కానీ.. వేడి చేసి తినడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే... మనం వండిన ఆహారం... గది ఉష్ణోగ్రతలో ఎక్కువ సేపు ఉంచినప్పుడు అందులో ఒక బ్యాక్టీరియా తయారౌతుంది. అయితే.. అన్నం వేడి చేసినప్పుడు సరిగా వేడి చేయకపోవడం వల్ల ఆ బ్యాక్టీరియా నాశనం కాదు. దాని వల్ల.. వాంతులు, విరేచనాలు లాంటివి అయ్యే అవకాశం ఉంటుంది. అలా అని ఫ్రిడ్జ్ లో ఉంచితే కూడా పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుందట. లివర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మరి, అన్నం ఎలా తినాలి?
అన్నం వీలైనంత వరకు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలట. వేడిగా ఉన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి వేసుకొని తింటే ఇంకా మంచిదట. లేదంటే.. మనం అన్నం వండిన తర్వాత ఒక గంటసేపు బయట ఉంచాలి. ఆ తర్వాత దానిని చల్లట నీటి గిన్నెలో ఉంచి చల్లపరచాలి. ఆ తర్వాత 24 గంటల వరకు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవచ్చు. ఉదయం వండిన ఆహారాన్ని రాత్రిపూట మాత్రం ఫ్రిడ్జ్ లో మాత్రం ఉంచకూడదు.
అన్నం వేడి చేయడానికి సరైన మార్గం ఏంటి?
వీలైనంత వరకు వేడి చేయకుండా ఆహారం తినడానికి ప్రయత్నించాలి. లేదు.. తప్పక వేడి చేయాల్సిన సందర్భం వస్తే... ఈ కింది విధంగా వేడి చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం...
1. మీరు బియ్యాన్ని మైక్రోవేవ్‌లో మళ్లీ వేడి చేస్తుంటే, ప్రతి కప్పు బియ్యానికి 1 టేబుల్ స్పూన్ నీరు వేసి, నీరు పీల్చుకునే వరకు వేడి చేయండి.
2. మీరు వంట స్టవ్ మీద బియ్యం వేడి చేస్తుంటే, నీరు, నూనె లేదా వెన్న వేసి వేయించి, అది ఆరిపోయే వరకు ఉడికించాలి.