Iron Fish:తినడానికి పనికిరాని చేప.. కానీ వారికి మాత్రం వరం..!
ఈ చేపను మనం వండుకునే ఏ కూరలో అయినా వేస్తాం. కానీ... తినకుండా పక్కన పెట్టేస్తాం. మరి, దీని వల్ల ఉపయోగం ఏంటా అనుకుంటున్నారా? మన శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచేస్తుంది. దీనినే ఐరన్ ఫిష్ అని పిలుస్తారు.

iron fish
చేప ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చేపలో ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే... ఇప్పుడు మనం మాట్లాడుకునేది తినే చేప కాదు. ఈ చేపను మనం వండుకునే ఏ కూరలో అయినా వేస్తాం. కానీ... తినకుండా పక్కన పెట్టేస్తాం. మరి, దీని వల్ల ఉపయోగం ఏంటా అనుకుంటున్నారా? మన శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచేస్తుంది. దీనినే ఐరన్ ఫిష్ అని పిలుస్తారు.
Iron fish
ఐరన్ ఫిష్ అనేది ఒక చిన్న కాస్ట్ ఐరన్ ముక్క. చూడటానికి చేప ఆకారంలో ఉంటుంది. దీనిని మనం నీటిలో లేదా వంటకాలో ఉడికిస్తారు. ఇది మన ఫుడ్ లో ఐరన్ శాతం పెంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా రక్త హీనతతో బాధపడేవారికి ఇది వరంలా పని చేస్తుంది. మీరు వండే ఏ కూరలో అయినా దీనిని వేసుకోవచ్చు. కూర ఉడికిన తర్వాత అందులో నుంచి ఐరన్ చేపను తీసేస్తాం. దానిని కడిగేసి... మరోసారి కూర వండినప్పుడు అందులో వేసుకోవడమే.
iron fish
ఈ ఐరన్ చేపను ఎలా వాడాలి?
ఐరన్ చేపను నీటిలో మరిగించండి:1 లీటర్ నీటిలో ఐరన్ ఫిష్‌తో పాటు కొద్ది నిమ్మరసం (Vitamin C కోసం) వేసి 10 నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని రోజంతా తాగడం వల్ల ఐరన్ స్థాయులు మెరుగవుతాయి.
ఆహారంతో ఉడకపెట్టడం..
సూప్‌లు, దాల్చిన కూరలు, సాంబార్, పులుసు వంటి వాటిలో ఐరన్ ఫిష్‌ను ఉంచి 10-15 నిమిషాలు ఉడికించాలి.
చివరిలో ఐరన్ ఫిష్‌ను తీసివేయాలి.
ఐరన్ ఫిష్ తీసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
ఐరన్ ఫిష్‌ను వాడిన తర్వాత బాగా కడిగి, పొడి చేసుకుని నిల్వ చేసుకోవాలి.
మరుగుతున్న సమయంలో కొద్దిగా నిమ్మరసం లేదా టమాటో కలిపితే ఐరన్ శోషణ మెరుగుపడుతుంది.
రోజుకు ఒకసారి మాత్రమే ఉపయోగించాలి.అధికంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు కలిగించే అవకాశం ఉంటుంది.
ఈ విధంగా ఐరన్ ఫిష్‌ను ఉపయోగించడం ద్వారా రక్తహీనతను తగ్గించుకోవచ్చు. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.