జామకాయ ఆరోగ్యానికి మంచిదే.. అయినా వీళ్లు మాత్రం తినొద్దు
పండ్లలో జామపండు ఒకటి. ఇది తీయగా టేస్టీగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తుంది. కానీ ఈ పండును కొంతమంది అస్సలు తినకూడదు. వాళ్లు ఎవరో తెలుసా?

జామకాయ
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలని రకరకాల పండ్లను తింటున్నారు. పండ్లలో మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలో పోషక లోపాలను కూడా తొలగిస్తాయి. ఇలాంటి పండ్లలో జామకాయ ఒకటి. జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ లు మెండగా ఉంటాయి.
జామకాయ
జామకాయను తింటే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటాం. అలాగే జీర్ఱక్రియ కూడా సక్రమంగా పనిచేస్తుంది. అందుకే వీటిని బాగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ పండు ఎంత ఆరోగ్యకరమైనదైనా కొందరికి మాత్రం హాని చేస్తుంది. అంటే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు జామకాయను అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
జామకాయను ఎవరు తినకూడదు?
జామకాయ మంచి హెల్తీ ఫుడ్. అయినప్పటికీ దీన్ని ఎవరు తినాలి? ఎవరు తినకూడదు? అనేది తెలుసుకోవడం అవసరం. దీనిలో ఉండే పొటాషియం కండరాలను, నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే మూత్రపిండాల సమస్యలు, అలెర్జీ, కడుపు సమస్యలు ఉన్నవారు మాత్రం జామకాయలను ఎక్కువగా తినకూడదు.
జీర్ణ సమస్యలు
జామకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు ఎంతో మేలుచేస్తుంది. దీన్ని తింటే మలబద్దకం సమస్య నుంచి బయటపడతారు. కానీ దీన్ని ప్రకోప పేగు సిండ్రోమ్ ఉన్నవారు మాత్రం తినకూడదు. అలాగే మీకు ఏదైనా కడుపు సమస్య ఉన్నాకూడా తినకూడదు. ఎందుకంటే దీనిలో ఎక్కువగా ఉండే ఫైబర్ వల్ల అపానవాయువు, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు పెరుగుతాయని సైన్స్ డైరెక్ట్ లో ప్రచురించిన ఒక అధ్యయనం వెల్లడిస్తోంది.
మూత్రపిండాల సమస్యలు
జామకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఈ పొటాషియాన్ని ఎక్కువగా తీసుకుంటే మాత్రం కిడ్నీ సమస్యలు మరింత పెరుగుతాయని కిడ్నీ ఫౌండేషన్ తెలుపుతోంది. అందుకే మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు జామకాయల్ని ఎక్కువగా తినకూడదు.
జామకాయను ఎలా తినాలి?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజుకు ఒకే జామకాయను తినాలి. అలాగే బాగా పండిన జామకాయనే తినాలి. ఇది పొట్టకు మేలు చేస్తుంది. అయితే ఓట్స్ లేదా పెరుగుతో జామకాయను తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే ఈ జామకాయకు బదులుగా మీరు బొప్పాయి పండును తింటే మంచిది. దీనిలో ఫైబర్, విటమిన్ సిలు కూడా మెండుగా ఉంటాయి.