వీళ్లు వెల్లుల్లిని అస్సలు తినకూడదు
వెల్లుల్లి మన ఆరోగ్యానికి మంచిదే. అయినప్పటికీ కొంతమంది మాత్రం వెల్లుల్లిని అస్సలు తినకూడదు. వాళ్లు ఎవరు? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్రతి వంటింట్లో వెల్లుల్లి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కూరల్ని టేస్టీగా చేస్తుంది. అంతేకాదు ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడటంలో వెల్లుల్లి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే దీన్ని ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు.
వెల్లుల్లిలో ఎన్నో దివ్య ఔషధ గుణాలుంటాయి. దీన్ని తినడం వల్ల జలుబు తగ్గుతుంది. మన ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. హైబీపీ కంట్రోల్ అవుతుంది. అలాగే ఇది క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇది డయాబెటీస్ పేషెంట్లకు మేలు చేస్తుంది. దీన్ని తింటే బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఇవి మాత్రమే కాదు వెల్లుల్లితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే వెల్లుల్లిని రోజూ తినమని చెప్తుంటారు.
వెల్లుల్లి ఎవరు తినకూడదు
వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేసినా.. దీన్ని మాత్రం కొందరు అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇది వీరి ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు వెల్లుల్లిని తినకూడదు. వాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఎవరెవరు వెల్లుల్లి తినకూడదు?
1. విరేచనాల సమస్య
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. విరేచనాల సమస్యతో బాధపడేవారు ఎట్టి పరిస్థితిలో వెల్లుల్లిని తినకూడదు. ఒకవేళ తిన్నారంటే దానిలోని ఘాటు ప్రేగులను ఉత్తేజపరిచి ఈ సమస్యను మరింత పెంచుతుంది.
2. గుండెల్లో మంట ఉన్నవారు
ఎసిడిటీ వల్ల గుండెల్లో మంట వచ్చేవారు కూడా పరిగడుపున వెల్లుల్లిని పొరపాటున కూడా తినకూడదు. ఎందుకంటే వెల్లుల్లిలోని కొన్ని సమ్మేళనాలు గుండెల్లో మంటను మరింత పెంచుతాయి. కడుపునకు సంబంధించిన సమస్యలను మరింత పెంచుతాయి. అంతేకాదు అలెర్జీని కూాడా కలిగిస్తుంది.
వెల్లుల్లి అలెర్జీలు
3. నోటి దుర్వాసన ఉన్నవారు:
నోటి దుర్వాసనకు ఎన్నో కారణాలు ఉంటాయి. వీటిలో వెల్లుల్లి ఒకటి. అవును వెల్లుల్లిని ఎక్కువగా తింటే నోట్లో నుంచి దుర్వాసన వస్తుంది. దీనికి కారణం వెల్లుల్లిలో ఉండే సల్ఫర్. మీకు గనుక ఇప్పటికే నోట్లో నుంచి దుర్వాసన వస్తుంటే వెల్లుల్లిని పొరపాటున కూడా తినకండి.
4. రక్తస్రావం సమస్య ఉన్నవారు:
రక్తం పలుచగా అయ్యే మందులను వాడే వారు, రక్తస్రావం సమస్య ఉన్నవారు వెల్లుల్లిని తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమస్యలను వెల్లుల్లి మరింత పెంచుతుంది.
5. గర్భిణులు & పాలిచ్చే తల్లులు:
అవును పాలిచ్చే తల్లులు కానీ, గర్భంతో ఉన్నవారు కానీ వెల్లుల్లిని తినకూడదు. ఎందుకంటే వీటిని ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే మోతాదుకు మించి తింటే పాలిచ్చే తల్లులకు పాల ఉత్పత్తి తగ్గుతుంది.
6. అలెర్జీ ఉన్నవారు:
వెల్లుల్లికి అలెర్జీ ఉన్నవారు కూడా ఉంటారు. ఇలాంటి వారు వెల్లుల్లిని తింటే చర్మం వాపు, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ మీకు ఇలాంటి సమస్యలు వస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.
7. అధిక చెమట:
కొంతమందికి సీజన్లతో సంబంధం లేకుండా చెమట విపరీతంగా పట్టేస్తుంటుంది. అలాగే చెమట వాసన కూడా ఎక్కువగా వస్తుంటుంది. ఇలాంటి వారు వెల్లుల్లిని తినకపోవడమే మంచిదంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఈ సమస్యలను వెల్లుల్లి మరింత పెంచుతుంది.