కీర దోసను వాళ్లు మాత్రం అస్సలు తినకూడదట ఎందుకో తెలుసా?
ఈ కీరదోస లో నీటి శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. దీనిని తినడం వల్ల.. బాడీ హైడ్రేటెడ్ గా కూడా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కీరదోసను కూడా కొందరు అస్సలు తినకూడదట. మరి... ఈ కీరదోసను ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం...
కీరదోస మార్కెట్లో సులభంగా లభించే కూరగాయ. ఇది చూడటానికి మనకు సాధారణంగానే కనిపించవచ్చు కానీ.. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండాకాలంలో కీరదోస తినడం వల్ల... వేడి తగ్గుతుందని భావిస్తాం. ఈ కీరదోస లో నీటి శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. దీనిని తినడం వల్ల.. బాడీ హైడ్రేటెడ్ గా కూడా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కీరదోసను కూడా కొందరు అస్సలు తినకూడదట. మరి... ఈ కీరదోసను ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం...
ఎవరికైతే యూరిన్ సమస్యలు ఉన్నాయో వారు కీరదోస అస్సలు తినకూడదు. ముఖ్యంగా ఎక్కువ యూరిన్ వెళ్లేవారు.. ఈ కీరదోసకు దూరంగా ఉండటమే మంచిది. తెలీక తిన్నా.. వారికి చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఎవరికైతే ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుందో వాళ్లు కూడా కీరదోస తినకుండా ఉండాలి. ఒకవేళ తింటే.. వారికి ఎసిడిటీ ప్రాబ్లం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి... ఆవిషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి.. తినకపోవడమే మంచిది.
కీరదోసలో కూలింగ్ ఫ్యాక్టర్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జలుబు, దగ్గు లాంటి సమస్య ఉన్నవారు.. కీరదోస తినకపోవడమే మంచిది. జలుబు ఉన్న సమయంలో తింటే... జలుబు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి.
ఎవరికైనా స్కిన్ ఎలర్జీలు ఉన్నా, లేదంటే ఏదైనా ఫుడ్ ఎలర్జీలు ఉన్నా కూడా... కీరదోస తినకూడదు. దానికి దూరంగా ఉండాలి. లేకపోతే... స్కిన్ ఎలర్జీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
cucumber
ఆయుర్వేదం ప్రకారం కీరదోస ఆరోగ్యానికి ఎంత మంచిదైనా కూడా, చలికాలం, వర్షాకాలంలో మాత్రం కీరదోస అస్సలు తినకూడదు. ఈ కాలాల్లో కీరదోస తింటే... అరుగుదల సమస్యలు వస్తూఉంటాయి.
ఇక కీరదోస ఎంత ఆరోగ్యానికి మంచిది అయినా.. రాత్రిపూట దానిని అస్సలు తినకూడదు. ఎందుకంటే.. రాత్రిపూట తినడం వల్ల.. నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఒక్కోసారి అసలు వచ్చిన నిద్రకూడా పోయే అవకాశం ఉంటుంది.
ఎండాకాలంలో అయినా కీరదోస ఎక్కువ మొత్తంలో తినకూడదు. ఎక్కువ మొత్తంలో తింటే.. కీరదోస తింటే డీ హైడ్రేషన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. నెగిటివ్ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.