బరువు తగ్గించే జ్యూస్ ఇది.. మీరూ తాగండి
బరువు పెరిగినంత ఈజీగా తగ్గడం మాత్రం సాధ్యం కాదు. ఈ విషయం బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవాళ్లకు తెలుస్తుంది. అయితే కొన్ని రకాల జ్యూస్ లను తాగితే మాత్రం తొందరగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు బారిన పడుతున్నారు. ఓవర్ వెయిట్ వ్యాధి కాకపోయినా.. ఇది గుండెపోటు, మధుమేహం వంటి ఎన్నో వ్యాధులొచ్చాలా చేస్తుంది. అంతేకాదు ఇది మన లైఫ్ టైం కూడా తగ్గిస్తుంది. అందుకే చాలా మంది బరువు తగ్గడానికి ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ, ఫుడ్ ను తగ్గిస్తున్నారు. అయితే కొంతమందికి వ్యాయామం చేసే టైం ఉండదు. ఇలాంటి వారు కూడా ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. కొన్ని రకాల జ్యూస్ లను తాగితే కూడా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. అవేం జ్యూస్ లు అంటే?
బీట్ రూట్ జ్యూస్
బీట్ రూట్ జ్యూస్ లో మంచి పోషకాలుంటాయి. ఈ జ్యూస్ ను తాగడం వల్ల ఒంట్లో రక్తం పెరగడంతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ జ్యూస్ మీ బరువును తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ లో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ జ్యూస్ ను తాగితే తొందరగా ఆకలి కాదు. అలాగే హెవీగా తినలేరు. ఈ రెండింటి వల్ల మీరు బరువు తగ్గుతారు.
carrot juice
క్యారెట్ జ్యూస్
క్యారెట్లు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఈ క్యారెట్ లోని విటమిన్ ఎ ఆకలిని తగ్గిస్తుంది. అలాగే తిన్న ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. క్యారెట్ జ్యూస్ తాగితే కూడా మీరు బరువు తగ్గుతారు. ఈ జ్యూస్ తాగితే మీ చర్మం కూడా అందంగా ఉంటుంది.
గ్రీన్ వెజిటబుల్ జ్యూస్
బచ్చలికూర, పాలకూర, కాకరకాయ వంటి ఆకుపచ్చ కూరగాయల్లో మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మీరు హెల్తీగా బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. రోజూ గ్రీన్ వెజిటేబుల్ జ్యూస్ ను తాగడం వల్ల వీటిలోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మీ బరువును తగ్గిస్తాయి.
cucumber juice
కీరదోసకాయ జ్యూస్
కీరదోసకాయలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ జ్యూస్ ను ఎండాకాలంలో రోజూ తాగాలని చెప్తారు. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దీనిలో ఫైబర్ కూడా మెండుగా ఉంటుంది. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
Aloe Vera Juice
అలోవెరా జ్యూస్
కలబందను ఎక్కువ అందం కోసమే ఉపయోగిస్తారు. నిజానికి ఇది మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. కలబంద రసంలో ఉండే పోషకాలు మన శరీర మెటబాలిజం ను పెంచుతాయి. దీంతో శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వులు కరిగిపోతాయి. మీరు ఈజీగా బరువు తగ్గుతారు.