బరువు తగ్గడానికి ఏం తినాలి?
బరువు పెరిగినంత తొందరగా తగ్గడం మాత్రం సాధ్యం కాదు. దీనికోసం చాలా కష్టపడాలి. అయితే మీరు కొన్ని ఆహారాలను తింటే మీ ఆకలి తగ్గి తొందరగా బరువు తగ్గుతారు. అవేంటంటే?
weight loss
బరువు పెరగడం చాలా ఈజీ. కొన్ని ఆహారాలను తింటే చాలా సులువుగా బరువు పెరిగిపోతారు. కానీ బరువు తగ్గడానికి మాత్రం నెలల నుంచి సంవత్సరాల సమయం పడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు చేయాల్సిన మొదటి పని ఆహారాలను తినడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఏవి పడితే అవి తింటే బరువు బాగా పెరిగిపోతారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు బరువు తగ్గాలన్నా, బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవాలన్నా.. కొన్ని ఆహారాలను ఖచ్చితంగా తినండి. ఎందుకంటే ఇవి మీ ఆకలిని తగ్గిస్తాయి. మీరు బరువు పెరగకుండా చేస్తాయి. వీటిని తినడంతో పాటుగా రోజూ వ్యాయామం కూడా చేయాలి. బరువు తగ్గడానికి ఏం తినాలంటే?
green tea
గ్రీన్ టీ
గ్రీన్ టీ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రీన్ టీని తాగడం వల్ల మీరు సులువుగా బరువు తగ్గుతారు. అలాగే బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది. గ్రీన్ టీ మీ ఆకలిని నియంత్రించి మీరు బరువు తగ్గేలా చేస్తుంది. ఈగ్రీన్ టీని తాగితే మీ గుండె ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
ప్రోటీన్ ఫుడ్
మన శరీరం బాగా పనిచేయాలంటే ప్రోటీన్లు చాలా అవసరం. ప్రోటీన్లు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. ప్రోటీన్లు ఆకలిని కంట్రోల్ చేస్తాయి. అలాగే మీరు ఎక్కువగా తినకుండా చేసి బరువు తగ్గేలా చేస్తాయి. ప్రోటీన్ లోపంతో ఎన్నో రోగాలొస్తాయి. అందుకే ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలను రెగ్యులర్ గా తినండి.
ginger garlic
అల్లం
అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. జింజెరోల్, ఇతర యాంటీఆక్సిడెంట్లు దీనిలో మెండుగా ఉంటాయి. ఇలాంటి అల్లాన్ని మన రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల కూడా ఊబకాయం నియంత్రణలో ఉంటుంది. అల్లం జీవక్రియను పెంచి బరువు తగ్గేలా చేస్తుంది. అంతేకాదు ఇది దగ్గు, జలుబు వంటి ఎన్నో చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా నయం చేస్తుంది.
అవిసె గింజలు
అవిసె గింజలు కూడా మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి, శరీర బరువును నియంత్రించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే అవిసె గింజలు మన శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తాయి. అలాగే ఇవి ఆకలిని కూడా నియంత్రిస్తాయి. దీంతో మీరు బరువు తగ్గొచ్చు.
chia seeds
చియా విత్తనాలు
చియా విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి చియా విత్తనాలను తీసుకోవడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. ఈ విత్తనాలు కూడా ఆకలిని తగ్గిస్తాయి.
avocado
అవొకాడో
అవోకాడో కూడా బరువును తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అవొకాడోను తింటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. మీరు సులువుగా బరువు కూడా తగ్గుతారు.