ఫాస్ట్ గా బరువు తగ్గాలంటే ఏం చేయాలి?
బరువు తగ్గడానికి ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ చేయాల్సిన పనులు మాత్రం చేయరు. నిపుణుల ప్రకారం.. కొన్ని చిట్కాలను గనుక పాటిస్తే మీరు చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు.
బరువు పెరిగినంత ఈజీగా తగ్గడం సాధ్యం కాదన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. నిజానికి బరువు పెరగడం వ్యాధేం కాదు. కానీ అధిక బరువు ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది మన లైఫ్ టైం ను కూడా తగ్గిస్తుంది. అయితే చాలా మంది బరువు తగ్గాలని ఒక్కపూట తినడమో, లేదా రాత్రి పూట తినకపోవడమో చేస్తుంటారు. తినడం మానేస్తే బరువు తగ్గిపోతామని చాలా మంది అనుకుంటుంటారు. నిజానికి మీరు ఫుడ్ మానేయడం వల్ల ఎన్నో సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అంతేకాక బరువు కూడా పెరిగిపోతారు.
weight loss
మనం ఆరోగ్యంగా ఉండాలంటే సూక్ష్మపోషకాలను తీసుకోవడం చాలా ముఖ్యం. మన శరీరానికి ఇవి తక్కువ మొత్తంలో అవసరం అయినప్పటికీ.. ఇవి అంతర్గత వ్యవస్థకు ఎంతో అవసరం. ఇది మీరు బరువు తగ్గడానికి, ఫిట్ గా ఉండటానికి బాగా సహాయపడుతుంది. బరువు తగ్గడానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి.
మన శరీరానికి అవసరమైన పోషకాల్లో పొటాషియం ఒకటి. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే నాడీ వ్యవస్థ పనితీరుకు సహాయపడుతుంది. అలాగే కణాలకు పోషకాలను అందిస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గేటప్పుడు కండరాలపై పనిచేస్తుంది. వ్యాయామం తర్వాత కోలుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది. వెయిట్ లాస్ అవ్వాలంటే పొటాషియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ ను ఎక్కువగా తినే ఆహారాన్ని తినాలని నిపుణులు చెబుతున్నారు.
మీరు ఫాస్ట్ గా బరువు తగ్గాలంటే పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ పొటాషియం ఏయే ఆహారాల్లో ఉంటుందో తెలుసుకుందాం పదండి.
కొబ్బరి నీరు
బరువు తగ్గే సమయంలో మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొబ్బరి నీరు మన దాహాన్ని తీర్చమే కాకుండా మనల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం ఎక్కువగా ఉంటాయి. ఈ వాటర్ ను తాగితే పాస్ట్ గా బరువు తగ్గుతారు. ఎందుకంటే ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే ఈ ఫ్రెష్ డ్రింక్ తాగడం వల్ల శరీరం ఫ్రెష్ గా ఉంటుంది. ఈ సహజ పానీయంలో మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి.
చిలగడదుంప
ఈ రూట్ వెజిటేబుల్ ను ఎండాకాలంలో బాగా తింటారు. ఇది మంచి పోషకాహారం. బరువు తగ్గాలనుకునేవారికి ఇది బాగా సహాయపడుతుంది. ఇందుకోసం వీళ్లు సాయంత్రం స్నాక్స్ గా తినొచ్చు. నిజానికి వీటిలోపిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. చిలగడదుంపల్లో ప్రోటీన్లు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ బి 6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది విటమిన్ ఎ కు మంచి వనరు. ఇది మీ మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మీ శరీరంలో నీరు నిలువకుండా చేస్తుంది. దీన్ని తింటే కడుపు ఉబ్బరం కూడా ఉండదు.
అరటి
అరటిపండు టేస్టీగా ఉండటమే కాదు ఇది తక్షణ ఎనర్జీని కూడా అందిస్తుంది. అరటి పొటాషియానికి మంచి వనరు. ఇది ఫుడ్ కోరికలను తగ్గిస్తుంది. ఏడాది పొడవునా దొరికే ఈ పండులో ఫైబర్ తో పాటుగా ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి జీవక్రియను బలోపేతం చేస్తాయి. ఈ పండును తింటే ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. అలాగే దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదాన్ని 30 శాతం తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లను రోజూ తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
రాజ్మా
రాజ్మాలో ప్రోటీన్, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. ఫుడ్ కోరికలను తగ్గిస్తుంది. అలాగే వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తుంది. వీటిని తింటే ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. రాజ్మాలో ఫోలేట్, ఐరన్, రాగి, విటమిన్ కె, మాంగనీస్ లు కూడా పుష్కలంగా ఉంటాయి.
ఆకుకూరలు
ఆకు కూరలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పొటాషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలు నీటిని నిలుపుకోవడాన్ని నిరోధిస్తాయి. గట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిని తింటే మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు.