పాయసాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసా?
ఈ పాయసాన్నే మనలో కొందరు పరమాన్నం అని, మరి కొందరు ఖీర్ అని పిలుస్తారు. మరి.. ఈ స్వీట్ ని ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారో మీకు తెలుసా?
ఇంట్లో ఏ శుభకార్యం అయినా, పండగ ఏదైనా ఇంట్లో పాయసం చేసుకుంటూ ఉంటాం. ఏదైనా మంచి జరుగింది అంటే.. మనం స్వీట్ తినాలి అనుకుంటాం. ఇక భారీతీయులు అయితే.. ఆ స్వీట్ కచ్చితంగా పాయసమే అవుతుంది. ఈ పాయసాన్నే మనలో కొందరు పరమాన్నం అని, మరి కొందరు ఖీర్ అని పిలుస్తారు. మరి.. ఈ స్వీట్ ని ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారో మీకు తెలుసా?
సాధారణంగా ఈ స్వీట్ ని మనం పాలు, అన్నం, పంచదార లేదంటే బెల్లంతో తయారు చేస్తారు. అదనంగా యాలకుల పొడి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్ మిస్ కూడా చేర్చుతాం. దీంతో.. దీనికి ఆ రుచి వస్తుంది. ఇన్ని పదార్థాలు ఉన్నా.. ఈ స్వీట్ లో రైస్ పాత్ర ఎక్కువ కావడంతో.. ఇంగ్లీష్ లో దీనిని రైస్ పుడ్డింగ్ డిజర్ట్ అని పిలుస్తారట.
ఈ స్వీట్ తయారీలో.. మనం పాలల్లో అన్నం ఉడికిస్తాం. దానిని మెత్తగా, క్రీమీగా వచ్చేలా ఉడికిస్తాం. తర్వాత షుగర్ లేదంటే బెల్లం జత చేస్తాం. అలా చేయడం వల్ల.. ఆ రైస్ కీ స్వీట్ నెస్ యాడ్ అవుతుంది. ఇక.. దీనికి కమ్మని రుచి రావడానికి యాలకుల పొడి , కుంకుమ పువ్వు కూడా జత చేస్తాం. అంతేనా.. మెత్తగా , స్మూత్ గా నోట్లో కరిగిపోయేలా ఉండే ఈ స్వీట్ లో.. మధ్యలో క్రంచీగా తగిలుతూ.. జీడిపప్పు, బాదం పప్పు మరింత రుచిని ఇస్తాయి.
ఇక.. ఈ స్వీట్ ని ఒక్కో ట్రెడిషన్ లో ఒక్కోలా చేస్తారు. దాదాపు అందరూ అన్నంతోనే చేస్తారు. కొందరు మాత్రం.. ఆ రైస్ ప్లేస్ లో... సేమ్యా ని కూడా వాడతారు. చేసే విధానం మాత్రం దాదాపు ఒకేలా ఉంటుంది.
ఇక ఈ స్వీట్ ని కొందరికి వేడి వేడిగా తినడం ఇష్టం ఉంటే... మరి కొందరికి చల్లగా అయిన తర్వాత తినడానికి ఇష్టపడతారు.