MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • Chia Seeds: నీళ్లలో కలిపి కాకుండా.. పెరుగులో చియా సీడ్స్ కలిపి తీసుకుంటే ఏమౌతుంది?

Chia Seeds: నీళ్లలో కలిపి కాకుండా.. పెరుగులో చియా సీడ్స్ కలిపి తీసుకుంటే ఏమౌతుంది?

Chia Seeds: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చియా సీడ్స్ ని తమ డైట్ లో భాగం చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా నీటిలో కలిపి తీసుకుంటారు. కానీ.. నీటిలో కాకుండా.. చియా సీడ్స్ ని పెరుగులో కలిపి తీసుకుంటే ఏమౌతుంది? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 24 2026, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చియా సీడ్స్...
Image Credit : Getty

చియా సీడ్స్...

చియా సీడ్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని నీటిలో కలిపి నానపెట్టి.. తీసుకుంటే శరీరానికి అవసరమయ్యే ఫైబర్, ప్రోటీన్ లభిస్తాయి. అలా కాకుండా.. పెరుగులో కలిపి చియా సీడ్స్ ని తీసుకోవడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా.. పెరుగులో ఉండ ప్రోబయోటిక్స్( మంచి బ్యాక్టీరియా), ప్రోటీన్ తో పాటు.. చియా సీడ్స్ లో ఉండే ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు లభిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జీర్ణక్రియ మెరుగుపడుతుంది...
Image Credit : Getty

జీర్ణక్రియ మెరుగుపడుతుంది...

పెరుగులోని ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చియా సీడ్స్ లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.

బరువు తగ్గిస్తుంది...

చియా సీడ్స్ నీటిని పీల్చుకొని జెల్ లాంటి ఆకృతికి మారతాయి. పెరుగులో కలిపి తీసుకుంటే కూడా ఇలానే ఉబ్బుతాయి. ఇలా పెరుగులో కలిపి తీసుకుంటే.. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్. రోజూ ఇలా తీసుకుంటే.. ఈజీగా బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది.

Related Articles

Related image1
Plastic Chair Cleaning:ఇంట్లో ప్లాస్టిక్ కుర్చీ మురికిగా మారిందా? రెండు నిమిషాల్లో కొత్తదానిలా మార్చే టెక్నిక్ ఇది
Related image2
Pearl Mangalsutra:ముత్యాల కాంబినేషన్ లో మంగళసూత్రం డిజైన్లు...చూసేయండి
34
ప్రోటీన్, కాల్షియం..
Image Credit : Pinterest

ప్రోటీన్, కాల్షియం..

పెరుగులో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. చియా సీడ్స్ లో కూడా కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలను అందిస్తాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి.

గుండె ఆరోగ్యానికి మేలు..

చియా సీడ్స్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి..

చియా సీడ్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. ఆహారం నెమ్మదిగా జీర్ణమౌతుంది. దీంతో.. రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరగకుండా ఉండేందుకు సహాయపడతాయి.

44
 పెరుగులో చియా సీడ్స్ ఎలా తీసుకోవాలి...?
Image Credit : stockPhoto

పెరుగులో చియా సీడ్స్ ఎలా తీసుకోవాలి...?

ఒక కప్పు పెరుగులో 1 నుండి 2 టీస్పూన్ల చియా సీడ్స్ కలపండి.

కనీసం 30 నిమిషాలు నాననివ్వండి.

కావాలంటే తేనె, పండ్ల ముక్కలు లేదా డ్రై ఫ్రూట్స్ కలిపి తినవచ్చు.

ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకోవచ్చు.

అయితే..మొదటిసారి తీసుకునేవారు తక్కువ మోతాదుతో ప్రారంభించాలి.చియా సీడ్స్ ఎక్కువగా తింటే కొందరికి గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం రావచ్చు.తగినంత నీరు కూడా తాగాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Related Stories
Recommended image1
Plastic Chair Cleaning:ఇంట్లో ప్లాస్టిక్ కుర్చీ మురికిగా మారిందా? రెండు నిమిషాల్లో కొత్తదానిలా మార్చే టెక్నిక్ ఇది
Recommended image2
Pearl Mangalsutra:ముత్యాల కాంబినేషన్ లో మంగళసూత్రం డిజైన్లు...చూసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved