Bath: తిన్న వెంటనే స్నానం చేస్తే ఏమౌతుంది?
ఆహారం తీసుకున్న తర్వాత స్నానం చేయడం వల్ల చాలా నష్టాలుు ఉన్నాయట. ముఖ్యంగా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట.

ఉదయం లేవగానే స్నానం చేయాలని.. స్నానం చేసిన తర్వాత మాత్రమే భోజనం చేయాలని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. ఇప్పటికీ దీనిని ఫాలో అయ్యేవారు చాలా మందే ఉన్నారు. కొందరు మాత్రం ఇలాంటివి ఏమీ పట్టించుకోరు. స్నానానికీ, తినడానికి ఏంటి సంబంధం అని అడ్డంగా వాదిస్తూ ఉంటారు. తిన్న తర్వాత మాత్రమే స్నానం చేసేవారు కూడా ఉన్నారు. అసలు.. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు..? తిన్న తర్వాత స్నానం చేస్తే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం...
shower
శాస్త్రాల పరంగా.. స్నానం తర్వాత మాత్రమే భోజనం చేయాలని చెబుతుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే కూడా ఇదే నియమం పాటించాలట. ఆహారం తీసుకున్న తర్వాత స్నానం చేయడం వల్ల చాలా నష్టాలుు ఉన్నాయట. ముఖ్యంగా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట.
భోజనం తర్వాత థర్మోజెనిసిస్
సాధారణంగా, భోజనం చేసిన వెంటనే మీ శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణ అవయవాలకు రక్త ప్రవాహం పెరగడం వల్ల ఇది జరుగుతుంది, దీని వలన శరీర ఉష్ణోగ్రత తాత్కాలికంగా పెరుగుతుంది. ఈ పరిస్థితిని భోజనం తర్వాత థర్మోజెనిసిస్ అంటారు. ఇలా శరీర ఉష్ణోగ్రత పెరిగిన సమయంలో గోరువెచ్చని నీటిలో స్నానం చేయడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత రెట్టింపు అవుతుంది. ఇది జీర్ణ అవయవాలకు రక్త ప్రవాహాన్ని రెట్టింపు చేస్తుంది. జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది.
వేడి నీటితో స్నానం చేస్తే కదా సమస్య.. మేము అసలు వేడి నీటితో స్నానం చేయము.. చల్లటి నీటితోనే చేస్తాం అని మీరు అనుకోవచ్చు. కానీ.. దాని వల్ల కూడా సమస్యలు ఉన్నాయట. తిన్న వెంటనే చల్లని స్నానం చేయడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. మీ రక్త నాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా, జీర్ణ అవయవాలకు సరైన రక్త ప్రవాహం ఉండదు. ఇది జీర్ణ ప్రక్రియకు కూడా అంతరాయం కలిగిస్తుంది.
జీర్ణ సమస్య
తిన్న వెంటనే స్నానం చేయడం, వెచ్చని నీటితో లేదా చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే ఇంట్లో పెద్దలు తిన్న వెంటనే స్నానం చేయకూడదు అని చెబుతుంటారు. మరి... ఎప్పుడు స్నానం చేయాలి అనే సందేహం మీకు కలగొచ్చు.దానికి కూడా సమాధానం ఉంది. వీలైనంత వరకు.. స్నానం చేసిన తర్వాతనే ఆహారం తీసుకోవడం మంచిది. అలా కాదు... కుదరలేదు అనుకుంటే... ఆహారం తిన్న 1-2 గంటల తర్వాత స్నానం చేయడం మంచిది. అప్పుడు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.