MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • వర్షాకాలంలో చేపలు తింటే ఏమౌతుందో తెలుసా?

వర్షాకాలంలో చేపలు తింటే ఏమౌతుందో తెలుసా?

చేపలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అందుకే చాలా మంది వారంలో ఒక్కసారైనా చేపలను ఖచ్చితంగా తింటుంటారు. కానీ వర్షాకాలంలో చేపలను తింటే ఏమౌతుందో తెలిస్తే అస్సలు తినరు.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 16 2024, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చేపలు మంచి పోషకాహారం. వీటిలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం,  సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివని చాలా మంది వారానికి ఒక్కసారైన తింటుంటారు. నిజానికి చేపలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.కానీ వానాకాలంలో అయితే కాదు. అవును వానాకాలంలో చేపలను తింటే లేనిపోని రోగాలు వస్తాయి. ఎందుకంటే  వర్షాకాలంలో నీటి వనరులు కలుషితమవుతాయి. వీటిలో పెరిగే చేపలను తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అసలు వానాకాలంలో చేపలను తినడం వల్ల వచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

పాదరసం

వర్షాకాలంలో వర్షాలు ప్రతిరోజూ కురుస్తూనే ఉంటాయి. ఈ భారీ వర్షాలకు జలాశయాల్లో పాదరసం వంటి మలినాలు బాగా పెరిగిపోతాయి. వీటిలో పెరిగే చేపల కణజాలాల్లో కూడా పాదరసం వంటి మలినాలు పేరుకుపోతాయి. ఇలాంటి చేపలను తినడం వల్ల మన నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. 

37

నీటి కాలుష్యం

వర్షాకాలంలో పరిశ్రమల నుంచి వెలువడే కలుషిత మురుగునీరంతా కుంటలు, చెరువులు, నదులు, సముద్రాల్లోకి చేరుతుంది. దీంతో ఈ నీరంతా కలుషితమవుతుంది. ఇలాంటి చేపలను తినడం వల్ల వికారం, వాంతులు, విరేచనాలు అవుతాయి. 
 

47

అంటువ్యాధులు

వర్షాకాలంలో జలవనరుల్లో మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల నీళ్లలో బ్యాక్టీరియా, వైరస్ లు, పరాన్నజీవులు బాగా పెరుగుతాయి. ఇలాంటి చేపలను తినడం వల్ల విరేచనాలు, కడుపు నొప్పి, బరువు తగ్గడం, అలసట వంటి సమస్యలు వస్తాయి. 

57

అలెర్జీ

చాలా మందికి వర్షాకాలంలో రోగనిరోధక  శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో కలుషితమైన చేపలను తినడం వల్ల దురద, దద్దుర్లు, వాపు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి. 
 

67

ఫుడ్ పాయిజన్

వర్షాకాలంలోనే చేపల సంతానోత్పత్తి జరుగుతుంది. ఇలాంటి సమయంలో గుడ్లున్న చేపలను తినడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ కు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 

77

చేపలను ఎలా తినాలి?

వర్షాకాలంలో చేపలను ఖచ్చితంగా తినాలనుకుంటే మాత్రం వీటిని బాగా వండాలి. అప్పుడే వాటిలో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది. మీరు చేపలు కొన్న వెంటనే ఉడికించి తినండి. నిల్వ ఉంచితే అందులో బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved