టీలో బిస్కెట్ ముంచుకొని తింటే ఏమౌతుంది..?
చాయ్- బిస్కెట్ కాంబినేషన్ నిజానికి అస్సలు మంచిది కాదట. మీ ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీస్తుందట. ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం..
చాయ్, బిస్కెట్ ఈ కాంబినేషన్ ని విపరీతంగా ఇష్టపడేవారు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు.. ఈ కాంబినేషన్ ని విపరీతంగా ఇష్టపడతారు. చాయ్ తాగాలంటే.. పక్కన బిస్కెట్ ఉండాల్సిందే. కానీ.. ఈ కాంబినేషన్ నిజంగా మంచిదేనా..? ఈ రెండూ కలిపి తీసుకుంటే ఏమౌతుంది. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...
చాలా మంది అమితంగా ఇష్టపడే ఈ చాయ్- బిస్కెట్ కాంబినేషన్ నిజానికి అస్సలు మంచిది కాదట. మీ ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీస్తుందట. ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం..
టీలో బిస్కెట్ ముంచుకొని తినడం వల్ల.. రక్తంలో బ్లడ్ షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. అలాంటి సమయంలో... ఉదయాన్నే.. ఈ టీ బిస్కెట్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ఇంకా ఎక్కువగా పెరిగిపోతాయి. షుగర్ పేషెంట్స్ కి మరింత ప్రమాదకరంగా ఉంటుంది.
ఒక చిన్న బిస్కెట్ ఏమౌతుంది లే అని మనం అనుకుంటాం. కానీ... బిస్కెట్లలో క్యాలరీలు, ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంుటంది. ఇవి మనం విపరీతంగా బరువు పెరగడానికి కారణం అవుతాయి. ఎవరైతే బరువు తగ్గాలి అనుకుంటున్నారో.. వారు... ఈ టీ, బిస్కెట్ కాంబినేషన్ కి దూరంగా ఉండటం మంచిది.
tea and biscuit
అంతేకాదు... చాయ్, బిస్కెట్ కాంబినేషన్ మీ గుండె ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. శరీరంలో.. బ్యాడ్ కొలిస్ట్రాల్ పెరిగిపోవడానికి కారణం అవుతుంది. ఫలితంగా గుండె పనితీరు తగ్గిపోతుంది. కాబట్టి.. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే... ఈ కాంబినేషన్ కి దూరంగా ఉండటమే మంచిది.
Irani Chai
బిస్కెట్ లో ఫ్యాట్ లెవల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల జీర్ణ సమస్యలు చాలా ఎక్కువగా వచ్చేస్తాయి. బిస్కెట్, టీ రెండూ.. అరుగుదల సమస్యలు పెరిగిపోతాయి. డయేరియా వంటి సమస్యలు వస్తాయి. టీ ఎక్కువగా తాగితే.. బ్లోటింగ్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది.
చాయ్, బిస్కెట్ తినగానే చాలా మంది తమకు ఎనర్జీ వచ్చినట్లు ఫీలౌతారు. కానీ... ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల నీరసం లాంటివి వస్తాయి. ఈ రెండింటిలోనూ ఎలాంటి న్యూట్రియంట్స్ ఉండవు. ఇవి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ఈ రెండింటి కాంబినేషన్ దంతాలకు కూడా మంచిదేమీకాదు. పంటి నొప్పి రావడం.. దంతాలు పాడవ్వడం లాంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు.. బిస్కెట్లో ఉప్ప క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల.. బ్లడ్ ప్రెజర్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే బీపీ ఉన్నవారు.. పొరపాటున కూడా ఈ రెండూ తినకపోవడమే మంచిది.