డయాబెటీస్ ఉన్నవాళ్లు ఏం తినాలో తెలుసా?
పెద్దలతో పాటుగా పిల్లలు కూడా డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఇది చిన్న సమస్యగా భావించినా ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ ను ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుకోవాలి. ఇందుకోసం హెల్తీ ఫుడ్ ను తినాలి.
రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగితే శరీరంలోని ఎన్నో భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే డయాబెటీస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాలి. అయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి ఫుడ్ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే డయాబెటీస్ ఉన్నవాళ్లు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నట్స్
నట్స్ డయాబెటీస్ ఉన్నవాళ్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఎలా అంటే రకరకాల నట్స్ ను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే షుగర్ లెవెల్స్ సాధారణంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
సాల్మన్ ఫిష్
చేపలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సాల్మన్ ఫిష్. వీటిలో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. సాల్మన్ ఫిష్ ను డయాబెటీస్ ఉన్నవాళ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ కూడా తగ్గుతుంది. ఇవి మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి.
ఆకు కూరలు
డయాబెటీస్ పేషెంట్లు ఏవి తిన్నా, తినకున్నా ఆకు కూరలను మాత్రం ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు బచ్చలికూరను రోజూ తినాలి. ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ తో పాటుగా ఎన్నో రకాల విటమిన్లు కూడా ఉంటాయి. ఈ బచ్చలికూర బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి బాగా సహాయపడుతుంది.
ధాన్యాలు
ధాన్యాలు కూడా డయాబెటీస్ ఉన్నవారికి బాగా ఉపయోగపడతాయి. బ్రౌన్ రైస్, ఓట్స్, గోధుమలు వంటి తృణధాన్యాలు మీ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. వీటిని తింటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
చిరుధాన్యాలు
చిరుధాన్యాలు, బీన్స్ తో పాటుగా చిక్కుళ్లను డయాబెటీస్ ఉన్నవారు రోజూ తినాలి. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్ మెండుగా ఉంటాయి. వీటిలో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తాయి. చిక్కుళ్లను తింటే కూడా డయాబెటీస్ రిస్క్ తగ్గుతుంది.
బెర్రీలు
బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు మంచి పోషకాల వనరులు. వీటిలో విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇవి బ్లడ్ షుగర్ ను నియంత్రిస్తాయి.