Fridge: ఫ్రిజ్ లో వేటిని పెట్టకూడదు?
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే చాలా మంది ఫ్రిజ్ ను ఖాళీగా లేకుండా వస్తువులతో నింపేస్తుంటారు. కానీ ఫ్రిజ్ లో ఏవి పడితే అవి పెట్టకూడదు.

ఫ్రిజ్
ఫ్రిజ్ లో మనం రకరకాల వస్తువులను పెట్టేస్తుంటాం. కొంతమంది అయితే ఫ్రిజ్ ఖాళీగా లేకుండా ఏవేవో ఆహార పదార్థాలను పెట్టేసి నింపేస్తుంటారు. ఫ్రిజ్ లో పెడితే ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని ఇలా పెట్టేస్తుంటారు. కానీ ఫ్రిజ్ లో ఏవి పడితే అవి పెట్టకూడదు. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తినడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వేటిని ఫ్రిజ్ లో పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్లాస్టిక్ బాటిల్
చాలా మంది ప్లాస్టిక్ బాటిల్లను ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నీళ్లు, పచ్చళ్లు, ఇతర ఫుడ్ ఐటమ్స్ ను తింటే ఆరోగ్యం పాడైపోతుంది. మీరు గనుక ప్లాస్టిక్ బాటిళ్లను ఫ్రిజ్ లో పెడితే అందులో తొందరగా బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనివల్ల మీరు జబ్బు బారిన పడతార. కాబట్టి ప్లాస్టిక్ కు బదులుగా గాజు సీసాలను ఉపయోగించడం అలవాటు చేసుకోండి.
తేనె
చాలా మంది తేనెను కూడా ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. కానీ తేనెను ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రిజ్ చల్లని ఉష్ణోగ్రత తేనెలో ఉన్న గ్లూకోజ్ ను స్ఫటికం చేస్తుంది. దీంతో తేనె చాలా చిక్కగా, గట్టిగా అవుతుంది. అందుకే తేనెను ఫ్రిజ్ లో పెట్టకూడదు.
ఆలుగడ్డ
బంగాళాదుంపలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని చాలా మంది ఫ్రిజ్ లో ఆలుగడ్డలను పెట్టేస్తుంటారు. కానీ వీటిని ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే బంగాళాదుంపల్లో ఉండే పిండి పదార్థం చక్కెరగా మారుతుంది. అంతేకాకుండా వీటిని వేయించేటప్పుడు ఈ చక్కెర హానికరమైన రసాయనాలను ఏర్పరుస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు.
నెయ్యి
నెయ్యిని కూడా చాలా మంది ఫ్రిజ్ లో నిల్వ చేస్తుంటారు. కానీ నెయ్యిని ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే నెయ్యిని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అది గడ్డకడుతుంది. దీనివల్ల నెయ్యిని పదేపదే వేడి చేయాల్సి వస్తుంది. ఇలా చేస్తే క్రమంగా నెయ్యి రుచి, వాసన రెండూ పాడవుతాయి.
పిండి
చాలా మంది పిండిని ఒకేసారి ఎక్కువగా కలిపేసి ఫ్రిజ్ పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు చపాతీలు చేసుకుని తింటుంటారు. కానీ కలిపిన పిండిని ఫ్రిజ్ లో ఎక్కువ సేపు పెట్టకూడదు. ఇలాంటి పిండితో చేసిన చపాతీలను తింటే కడుపు నొప్పి, గ్యాస్, ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు వస్తాయి.