సబ్జా గింజలు మనకు ఎలా ఉపయోగపడతాయి?
మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఫుడ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం వృద్ధాప్యంలో ఎన్నో వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. పండ్లు, కూరగాయలతో పాటుగా కొన్ని ప్రత్యేక రకాల విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో సబ్జా విత్తనాలు ఒకటి. సబ్జా విత్తనాలు మన ఆరోగ్యానికి ఎంతటి మేలు చేస్తాయో తెలుసా?
సబ్జా విత్తనాలను తీపి తులసి, తులసి విత్తనాలు అని కూడా పిలుస్తారు. ఇవి చూడటానికి చియా విత్తనాల మాదిరిగానే కనిపిస్తాయి. ఈ చిన్న విత్తనాలు పోషణకు పవర్ హౌస్. వీటిని రోజూ కొద్దిమొత్తంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని డైరెక్ట్ గా తినలేం. కానీ వీటిని కాసేపు నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు. వీటిని ఎక్కువగా రసాలు, స్మూతీలు, షేక్స్ అలాగే డెజర్ట్లలో ఉపయోగిస్తారు.
సబ్జా గింజల పోషకాలు
సబ్జా గింజల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ కె, ఆరోగ్యకరమైన కొవ్వు, కార్బోహైడ్రేట్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, పిండి పదార్థాలతో పాటుగా ఎన్నో రకాల ఖనిజాలు, కేలరీలు పుష్కలంగా ఉంటాయి. వీటికి చలువ చేసే గుణం ఉంటుంది. అందుకే వీటిని ఎండాకాలంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అసలు ఈ గింజలను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటే?
బరువు తగ్గడానికి..
సబ్జా గింజల్లో మంచి మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇవీటిని తింటే మీకు పదే పదే ఆకలి కాదు. అలాగే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. మొత్తంగా ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ విత్తనాలలో ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం కూడా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. దీంతో మీరు బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది.
=జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి
సబ్జా గింజల్లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ గింజల్ని తినడం వల్ల గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ గింజలు మండే ఎండల్లో మన పొట్టను చల్లగా ఉంచుతాయి.
రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి
టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారికి సబ్జా గింజలు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ సబ్జా గింజలను తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోయే సమస్య చాలా వరకు తగ్గుతుంది.
జలుబు, దగ్గు నుంచి ఉపశమనం
సబ్జా గింజల్లో ఉండే పోషకాలు కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఎన్నో సీజనల్, అంటు వ్యాధుల ప్రమాదం నుంచి తప్పించుకుంటారు.