MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • బరువు తగ్గాలంటే అన్నం మానేయాల్సిందేనా?

బరువు తగ్గాలంటే అన్నం మానేయాల్సిందేనా?

బరువు తగ్గాలంటే రెగ్యులర్ గా వ్యాయామం చేయడంతో పాటుగా.. ఫుడ్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలంటారు నిపుణులు. అయితే అన్నం తింటే బరువు పెరుగుతారనే మాటను మీరంతా వినే ఉంటారు. మరి బరువు తగ్గాలంటే అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిందేనా? 
 

Shivaleela Rajamoni | Published : Jan 07 2024, 12:28 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

ప్రపంచంలో ఎక్కువగా తినే ఆహారాలలో అన్నం ఒకటి. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవే మన దైనందిన కార్యకలాపాలకు అవసరమైన శక్తిని ఇస్తాయి. అంతేకాక ప్రతి దేశంలోని ఆహార సంస్కృతి కూడా ఆయా ప్రాంతాలలో నివసించే వారి ఆరోగ్యానికి ఇదే ఆధారం కూడా. అన్నంలోని కార్భోహైడ్రేట్లు మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. దీంతో మనం రోజువారి పనులను పూర్తిచేసుకోగలుగుతాం.
 

26
Asianet Image

అయితే అన్నం తింటే బరువు పెరుగుతారన్న వాదన కూడా ఉంది. ఈ మాటను మీరు వినే  ఉంటారు. అందుకే బరువు తగ్గడానికి ఆహారం నుంచి అన్నాన్ని పూర్తిగా మానేసే వారు కూడా ఉన్నారు. బరువు తగ్గాలంటే నిజంగా అన్నాన్ని పూర్తిగా మానేయాలా? అన్నం వల్లే బరువు బాగా పెరిగిపోతారా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి. 
 

36
rice

rice

బియ్యంలో కార్బోహైడ్రేట్లతో పాటుగా మెగ్నీషియం, ఫైబర్, భాస్వరం, మాంగనీస్, సెలీనియం, ఐరన్, బి విటమిన్లు వంటి మన ఆరోగ్యానికి అవసరమైన పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారకాలన్నీ జీర్ణక్రియ, శక్తి ఉత్పత్తి, కొవ్వును బర్న్ చేయడం, హార్మోన్లను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి.

46
Asianet Image

ఇన్ని ఉన్నప్పటికీ బియ్యం కూడా బరువు పెరగడానికి దారితీస్తాయి. లిమిట్ లో తింటే ఈ సమస్య ఉండదు. అన్నాన్ని మోతాదుకు మించి తినడం వల్లే బరువు పెరిగిపోతారు. మీరు బరువు పెరగకూడదంటే  అన్నం తినే పరిమాణాన్ని తగ్గించడమే దీనికి పరిష్కారం. 

56
Asianet Image

ముఖ్యంగా ఇప్పటికే స్థూలకాయం ఉన్నవారు, మధుమేహంతో బాధపడేవారు అన్నం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు రోజుకు ఒకసారి మాత్రమే అన్నం తినాలి. అలాగే అన్నంతో పాటుగా కూరగాయలను చేర్చకపోవడం పోషకాహార లోపానికి దారితీస్తుంది. అందుకే కూరగాయలను ఎక్కువగా తినాలి. అన్నం తక్కువగా తినాలి. 
 

66
rice

rice

అలాగే వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ యే మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే తెల్ల బియ్యం మంచిది కాదని దీని అర్థం కాదు. బరువు తగ్గించే డైట్ కు వైట్ రైస్ కాస్త బెటర్. బరువు తగ్గాలంటే అన్నాన్ని ఆహారం నుంచి పూర్తిగా తొలగించడం పూర్తిగా మంచిది కాదు. ఒకవేళ మీరు అన్నాన్ని పూర్తిగా మానేయాలనుకంుటే వైద్యుడికి తెలియజేసి, అవసరమైన సూచనలు తీసుకున్న తర్వాత మాత్రమే చేయండి. లేదంటే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories