రోజంతా నీరసంగా ఉంటుందా..? అమ్మమ్మ సీక్రెట్ డ్రింక్ తాగాల్సిందే..!
విటమిన్ సప్లిమెంట్స్, ఎనర్జీ డ్రింక్స్ కూడా తాగుతారు. అయినా కూడా.. ఆ నీరసం మాత్రం వదిలిపెట్టదు. అలాంటివాళ్లు.. భయంతో డాక్టర్ దగ్గరకు పరుగులు పెట్టకుండా.. కేవలం.. అమ్మమ్మల నాటి ఓ సీక్రెట్ హెల్దీ డ్రింక్ తాగితే చాలు.
అసలే వర్షాకాలం. ఉదయాన్నే లేవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే.. వాతావరణం చల్లగా ఉండటం వల్ల నిద్రలేవాలి అనిపించకపోవడం లో పెద్ద సమస్య ఏమీ లేదు. కానీ... వాతావరణంతో సంబంధం లేకుండా.. బెడ్ దిగాలంటే కష్టంగా అనిపిస్తోందా..? అసలు బాడీ సహకరించడం లేదా..? నీరసం ఎక్కువగా అనిపిస్తుందా..? ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
నీరసం ఎక్కువగా ఉందని.. ఎక్కువ ఆహారం తీసుకోవడం, పండ్లు, జ్యూస్ లు తాగడం లాంటివి చేస్తూ ఉంటారు. విటమిన్ సప్లిమెంట్స్, ఎనర్జీ డ్రింక్స్ కూడా తాగుతారు. అయినా కూడా.. ఆ నీరసం మాత్రం వదిలిపెట్టదు. అలాంటివాళ్లు.. భయంతో డాక్టర్ దగ్గరకు పరుగులు పెట్టకుండా.. కేవలం.. అమ్మమ్మల నాటి ఓ సీక్రెట్ హెల్దీ డ్రింక్ తాగితే చాలు. మరి ఆ హెల్దీ డ్రింక్ ఏంటి..? అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం...
anjeer
శరీరంలో బలహీనత రావడానికి కారణాలు చాలానే ఉండొచ్చు . శరీరంలో అవసరమైన పోషకాలు లేకపోవడం , అనేక ఆరోగ్య పరిస్థితులు బలహీనత అలసటను కలిగిస్తాయి. ఆహారంలో అవసరమైన పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు శరీరానికి బలాన్ని ఇస్తాయి.
మీలో చాలా మందికి అత్తిపండ్లు అదేనండి అంజీరా తెలిసే ఉంటుంది. ఈ అంజీరా పండ్లు.. మీ నీరసాన్ని చాలా తక్కువ సమయంలోనే దూరం చేస్తాయంటే నమ్ముతారా..? మన అమ్మమ్మల కాలంలో నీరసానికి ఇదే హెల్దీ డ్రింక్ ప్రయత్నించేవారు.
ఏమీ లేదు.. ఎండు అంజీరా పండ్లను రాత్రిపూట పాలల్లో నానపెట్టి.. ఉదయాన్నే తాగడమే. పాలు తాగిన తర్వాత అంజీరా పండ్లను కూడా తినేయాలి. లేదంటే...ఆ రెండింటినీ బ్లెండ్ చేసి.. డ్రింక్ లాగా తాగేయడమే. కేవలం నాలుగు రోజులు ఈ డ్రింక్ తాగినా.. మీ నీరసం తగ్గిపోయి.. ఫలితాలు మీరే చూస్తారు.
అంజీరా పండ్లను చాలా మంది తక్కువ అంచనా వేస్తారు. కానీ.. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ ,జింక్ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరం అయిన వెచ్చదనాన్ని అందిస్తుంది. వీటిని నీటిలో లేదంటే.. పాలల్లో నానపెట్టి తినడం వల్ల.. శరీరానికి అవసరమైన బలాన్ని అందిస్తాయి. ఎవరైనా శరీరంలో రక్తం తక్కువగా ఉండి బాధపడుతున్నట్లయితే ఇది తింటే ఆ సమస్య నుంచి బయటపడతారు.
అంజీరా పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.పాలలో నానబెట్టి తింటే రోగ నిరోధక శక్తి బలపడి వ్యాధులు రాకుండా ఉంటాయి.
ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల మలబద్దకాన్ని నివారిస్తుంది.శరీరం డిటాక్సిఫై అవుతుంది.
ఇక.. పాలల్లో వీటిని నానపెట్టి తినడం వల్ల... చర్మం కూడా ఆరోగ్యంగా మారడానికి సహాయం చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. పాలల్లో నానపెట్టి తినడం వల్ల నీరసం తగ్గిపోయి.. ఎనర్జీ వచ్చేస్తుంది. ఒక్కవారం ప్రయత్నంచి చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది.