మీ ఫేవరేట్ క్రికెటర్ల ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా?
ఇతర దేశాల్లోనూ వీరికి విపరీతమైన క్రేజ్ ఉంది. మరి అంత మంది అభిమానించే మీ ఫేవరేట్ క్రికెటర్ల ఫేవరేట్ ఫుడ్స్ ఏంటో ఓసారి చూసేద్దామా..
టీమిండియా క్రికెటర్లకు ఉన్నక్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. మన క్రికెటర్లకు మన దేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లోనూ వీరికి విపరీతమైన క్రేజ్ ఉంది. మరి అంత మంది అభిమానించే మీ ఫేవరేట్ క్రికెటర్ల ఫేవరేట్ ఫుడ్స్ ఏంటో ఓసారి చూసేద్దామా..
1.మహేంద్ర సింగ్ ధోనీ..
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బటర్ చికెన్ , తందూరీ నాన్ కాంబినేషన్ చాలా ఇష్టమట. ఆయన ట్విట్టర్ బయో ప్రకారం ఈ విషయం తెలిసింది.
Sachin Tendulkar
2.సచిన్ టెండుల్కర్..
సచిన్ టెండుల్కర్ ఇన్ స్టాగ్రామ్ అప్ డేట్స్ ప్రకారం.. ఆయనకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అదేవిధంగా ఆయన కు బార్లీ వంగీ, వరణ్ బాత్ అంటే కూడా ఇష్టమట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.
3.రోహిత్ శర్మ..
రోహిత్ శర్మ మంచి ఫుడ్డీ అనే విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఈయనకు ముంబయి స్ట్రీట్ ఫుడ్ వడా పావ్, పావ్ బాజీ, ఆలూ పరాటా అంటే చాలా ఇష్టం. అలాగే, చైనీస్ ఫుడ్ , గుడ్డుతో చేసిన ఏ ఆహారం అయినా ఆయనకు చాలా ఇష్టమట.
4.భువనేశ్వర్ కుమార్..
భువనేశ్వర్ కుమార్ కి ఎక్కువగా హోమ్ ఫుడ్ అంటే ఇష్టమట. ఎక్కువగా ఖాదీ చావల్, ఉరాద్ దాల్ అంటే ఇస్టం. అది కూడా వాళ్ల అమ్మ చేతితో చేసినది అయితే, మరింత ఇష్టం.
5.యజ్వేంద్ర చాహల్..
యజ్వేంద్ర చాహల్ కి గార్లిక్ నాన్, బటర్ చికెన్, చోలే కుల్చే, పానీపూరీ, దాల్ తడ్కా అంటే ఎక్కువగా ఇష్టమట. వీటినే తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.
Rishabh Pant
6.రిషభ్ పంత్..
యంగ్ క్రికెటర్ రిషభ్ పంత్ కి ఎక్కువగా ఛోలే బటోరే, ఆలూ పరోటా అంటే ఇష్టం. వీటితో పాటు అప్పుడప్పుడు ఆయన ఐస్ క్రీమ్స్ ని ఎక్కువగా తింటూ ఉంటారట.
Hardik Pandya
7.హార్దిక్ పాండ్యా..
హార్దిక్ పాండ్యాకి ఎక్కువగా మ్యాగీ తినడం అంటే ఇష్టం. అదేవిధంగా గ్రీన్ టీ తాగడానికి ఆయన ఇష్టపడతారట. ఈ సింపుల్ ఫుడ్స్ మాత్రమే ఆయన ఫేవరేట్.
8.శిఖర్ ధావన్..
శిఖర్ ధావన్ కి థాయ్ ఫుడ్స్ అంటే విపరీతంగా ఇష్టమట. వీలు దొరికినప్పుడల్లా వాటిని తినడానికి ఇష్టం చూపిస్తారు. ఇది కాకుండా, ఆయనకు హైదరాబాద్ బిర్యానీ, ఆలూ పరాటా తినడానికి ఇష్టపడతారు.
9.విరాట్ కోహ్లీ..
ఫిట్నెస్ ఫ్రీక్ విరాట్ కోహ్లీ ఎక్కువగా ఆరోగ్యకరమైన ఆహారం తినడానికే ఎక్కువగా ఇష్టపడతారు. అయితే, మొదట్లో మాత్రం ఛోలే బటోరే, ఆలూ పరాటా, షుషీ వంటివి తినేవారట.