- Home
- Life
- Food
- Fake Paneer : మీరు వాడే పనీర్ ఒరిజినలేనా? నకిలీ పనీర్‌ను గుర్తించడానికి సింపుల్ చిట్కాలు ఇవిగో
Fake Paneer : మీరు వాడే పనీర్ ఒరిజినలేనా? నకిలీ పనీర్‌ను గుర్తించడానికి సింపుల్ చిట్కాలు ఇవిగో
Fake Paneer : మార్కెట్లో పనీర్ ఈజీగా లభిస్తుంది కదా.. కాని అది తయారు చేయడానికి చాలా పాలు కావాలి. మరి పాలే కల్తీగా మారిపోతే పనీర్ కాకుండా ఉంటుందా? నకిలీ పనీర్ ను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పనీర్ ను చాలా మంది ఇష్టపడతారు. శాఖాహారులకైతే ఇది ఒక సూపర్ ఫుడ్. దీంతో అనేక రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. పనీర్ తింటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ లభిస్తాయి. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్, క్యాల్షియం ఉంటాయి.
మార్కెట్ లో దీనికి డిమాండ్ కారణంగా కొందరు వ్యాపారులు నకిలీ పనీర్‌ను తయారు చేసి అమ్మేస్తున్నారు. మరి మీరు కొని తింటున్న పనీర్ అసలైనదేనా? లేదా నకిలీదా? కేవలం చూసి, టచ్ చేసి ఏది నకిలీ, ఏది నిజమైన పనీరో గుర్తించడం కష్టం. కల్తీ పనీర్ ని సులభంగా గుర్తించడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ రుచి..
పనీర్ పాల నుండి తయారవుతుంది కాబట్టి దానికి పాల రుచి ఉంటుంది. పాలు మరిగించి, విరిగిపోయిన తర్వాత పనీర్ తయారు చేస్తారు కనుక ఒరిజినల్ పనీర్ కొద్దిగా పాలు, క్రీమీ రుచిని కలిగి ఉంటుంది. కల్తీ పనీర్ టేస్ట్ చాలా తేడాగా ఉంటుంది.
పిండిలా ఉంటే నకిలీ
ఒక చిన్న పనీర్ ముక్కను తీసుకుని మీ చేతులతో నలిపి చూడండి. అది ముక్కలుగా పిండిగా మారిపోతే అది నకిలీదని అర్థం. ఎందుకంటే ఒరిజినల్ పనీర్ అంతగా ముక్కలు కాదు.
సాఫ్ట్ గా ఉంటే ఒరిజినల్
నకిలీ పనీర్ కొద్దిగా గట్టిగా, రబ్బరు లాగా ఉంటుంది. అదే అసలైనదైతే మృదువుగా, స్పాంజి లాగా ఉంటుంది. కాబట్టి మీరు కొనుగోలు చేసేటప్పుడు దానిని తేలికగా నొక్కి చూడండి. అది అసలైనదా లేదా నకిలీదా అని సులభంగా తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: రోజూ భోజనంలో పప్పు తింటే మంచిదే.. కాని..
నీటిలో పరీక్ష
పనీర్‌ను నీటిలో వేసి అసలైనదా లేదా నకిలీదా అని తెలుసుకోవచ్చు. దీని కోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక పనీర్ ముక్కను వేయండి. అది కరగడం ప్రారంభించినా, లేదా దాని నుండి తెల్లటి నురుగు వస్తున్నా అది నకిలీదని అర్థం. ఎందుకంటే ఒరిజినల్ పనీర్ నీటిలో కరగదు.
ప్యాకెట్ పై వివరాలు చదవండి
మీరు మార్కెట్ నుండి ప్యాక్ చేసిన పనీర్ కొనాలనుకుంటే ప్యాకెట్ పై రాసిన వివరాలను చదవండి. ఒరిజినల్ పనీర్ అయితే పాలు, నిమ్మరసం, వెనిగర్ ఉపయోగించి తయారు చేస్తారు. ఇవి కాకుండా ఇంకా ఏ పదార్థాలు ఉన్నా అది నకిలీదని అర్థం చేసుకోండి. అలాంటి వాటిని కొనకుండా ఉండటమే మంచిది.