MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • కూరలో పులుపు ఎక్కువైతే ఏం చేయాలి?

కూరలో పులుపు ఎక్కువైతే ఏం చేయాలి?

అనుకోకుండా కూరల్లో ఉప్పు ఎక్కువైనట్టే కొన్ని కొన్ని సార్లు పులుపు కూడా ఎక్కువ అవుతుంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో కూరల్లో పులుపును సులువుగా తగ్గించొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 23 2025, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పనులు ఎక్కువగా ఉన్నా.. అనుకోకుండాఇంటికి చుట్టాలు వస్తున్నారన్నా.. ఆడవాళ్లు హాడావుడిగా వంటలు చేస్తుంటారు. ఈ హడావుడి వల్ల కూరల్లో పులుపు ఎక్కువగా అవుతుంటుంది. కానీ దీనివల్ల మీ ముడ్, గంటల తరబడి మీరు చేసిన శ్రమ మొత్తం వేస్ట్ అవుతుంది. నిజానికి  ఇలాంటి వంటింట్లో తరచుగా జరుగుతుంటాయి. కానీ దీనివల్ల వంటలన్నీ వేస్ట్ అవుతుంటాయి. ఇది ఆడవాళ్లను చాలా బాధపెడుతుంటుంది. అందుకే కూరల్లో పులుపు ఎక్కువైనప్పుడు దాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కూరల్లో పులుపు తగ్గాలంటే ఏం చేయాలి?

బెల్లం వాడాలి

బెల్లంతో తీపి వంటకాలను చేస్తాం. ఇది అందరికీ తెలుసు. కానీ ఈ బెల్లంతో కూరల్లో పులుపును బ్యాలెన్స్ చేయొచ్చు తెలుసా? బెల్లం తీపి పులుపును సమతుల్యం చేయడమే కాకుండా కూరల్ని మరింత టేస్టీగా, కొత్తరుచిని ఇస్తుంది. కూరల గ్రేవీలో పులుపును నార్మల్ చేయడానికి దానిలో 2 టీస్పూన్ల బెల్లాన్ని వేసి బాగా కలపండి. కానీ ఎక్కువగా మాత్రం వేయకండి. లేదంటే కూరల టేస్ట్ తీయగా, డిఫరెంట్ గా అవుతుంది. 
 

35

పాల మీగడ

అవును పాల మీగడ కూడా వంటల్లో పులుపును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. కూరలో పులుపు పెరిగితే ఈ క్రీమ్ వెంటనే తగ్గిస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా కూర గ్రేవీకి 1 టీస్పూన్ క్రీమ్ ను వేసి బాగా కలపండి. దీన్ని చిన్న మంటపై ఉడికించండి. దీంతో క్రీమ్ గ్రేవీతో బాగా కలిసిపోతుంది. 
 

45

ఉడికించిన బంగాళాదుంపలు

ఉడికించిన బంగాళాదుంపలతో కూడా కూరల్లో పులుపును తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను పాటించడానికి మీరు చేయాల్సిందల్లా గ్రేవీలో సగం ఉడికించిన బంగాళాదుంప ముక్కలను వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించండి. ఈ బంగాళాదుంపలు కూరల్లో ఉడికిన తర్వాత వాటిని గ్రేవీ నుంచి తీసేయొచ్చు కూడా. 

55


బేకింగ్ సోడా

బేకింగ్ సోడాను వంటల్లో వాడుతుంటాం. కానీ దీన్ని ఉపయోగించి పులుపును తగ్గించుకోవచ్చన్న ముచ్చట ఎవ్వరికీ తెలియదు. అయితే దీన్ని ఉపయోగించి ఎక్కువైన పులుపును సులువుగా తగ్గించుకోవచ్చు.  కూరగ్రేవీలో చిటికెడు బేకింగ్ సోడా వేయండి. కానీ ఎక్కువగా మాత్రం వేయకండి. లేదంటే కూర రుచి చెడిపోతుంది. కూరలో పులుపును తగ్గించడానికి 1/4 టీస్పూన్ బేకింగ్ సోడా అయితే సరిపోతుంది. సోడా వేసిన తర్వాత కూరను కొద్దిసేపు ఉడికించాలి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Onion: రోజూ ఒక పచ్చిఉల్లిపాయ తింటే డయాబెటిస్ కంట్రోల్ ఉంటుందా?
Recommended image2
Chandramukhi Chicken Fry: నార్మల్ చికెన్ ఫ్రై బోర్ కొట్టిందా? ఈ చంద్రముఖి చికెన్ ఫ్రై ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది
Recommended image3
Chia Seeds: చియా సీడ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమౌతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved