బ్రేక్ ఫాస్ట్ చేసే టైమ్ లేదా..? పది నిమిషాల్లో దోశ రెడీ
నిజానికి ఈ దోశ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మరి.. ఆ ఇన్ స్టాంట్ దోశ తయారు చేయడానికి ఏం కావాలి..? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం....
Dosa
ఉదయాన్నే లేవగానే మనకు కడుపులో బ్రేక్ ఫాస్ట్ పడాల్సిందే. సౌత్ ఇండియన్స్ కాబట్టి.. మనం దాదాపు ఇడ్లీ, దోశ, వడ లాంటివి తినడానికి ఇష్టపడతాం. కానీ.. ఈ బ్రేక్ ఫాస్ట్ లకు పిండి ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. ముందు రోజే పప్పునానపెట్టుకొని, రాత్రి గ్రైండ్ చేసి పెట్టుకుంటేనే ఉదయం వాటిని తినడానికి ఉంటుంది. ఏదైనా రోజు మర్చిపోయాం అంటే.. మళ్లీ.. బ్రేక్ ఫాస్ట్ ఏం చేయాలి రా అని ఆలోచించాల్సిందే. అయితే.. అలా ముందు రోజు కష్టపడకుండా... సూపర్ హెల్దీ ఇన్ స్టాంట్ దోశను తయారు చేసుకోవచ్చు.
నిజానికి ఈ దోశ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మరి.. ఆ ఇన్ స్టాంట్ దోశ తయారు చేయడానికి ఏం కావాలి..? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం....
ఈ ఇన్ స్టాంట్ దోశ పిండిని తయారు చేయడానికి మనం గోధుమ పిండి, పచ్చి బఠానీలు తీసుకుంటే సరిపోతుంది. దీనిని తయారు చేయడం సులభంగా ఉంటుంది. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. చాలా మంది ఇన్ స్టాంట్ దోశలు చేయడానికి పెరుగు, సోడా లాంటివి వాడతారు. అవి లేకుండా కూడా ఈ దోశ తయారు చేయవచ్చు.
దీని కోసం ఒక కప్పు గ్రీన్ పీస్ తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో వేసి, అందులో నాలుగైదు వెల్లుల్లి ెబ్బలు, పచ్చి మిరపకాయలు, అల్లం చిన్న ముక్క, కొత్తి మీర వేసి.. మెత్తగా పేస్టు చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్టును ఒక గిన్నెలో వేసి.. అందులో కప్పు మైదా పిండి, ఒక కప్పు బొంబాయి రవ్వ, రుచికి తగినంత ఉప్పు వేసి పిండి కలుపుకోవాలి.
Dosa
దోశ బ్యాటర్ లాగా మార్చుకోవాలి. కావాలంటే.. జీలకర్ర కూడా చేర్చవచ్చు మనం రవ్వదోశకు ఎలాగైతే పిండి కలుపుకుంటామో.. అలా కలుపుకొని.. వేడి వేడిగా దోశలు వేసుకోవడమే. టేస్టు అదిరిపోతుంది. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యమే కాకుండా.. రుచిని కూడా అందిస్తుంది.