క్యారెట్, బీట్రూట్ కలిపి జ్యూస్.. దీని వల్ల ఎంటి లాభం..?
రోగ నిరోధక శక్తిని పెంచడంలో... వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో క్యారెట్, బీట్రూట్ లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రెండు కలిపి తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
ఓ వైపు వాతావరణం బాగా మారిపోయింది. మరో వైపు దేశంలో కరోనా సెకండ్ వేవ్ కూడా విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో దేశంలోని ప్రజలకు రోగనిరోధక శక్తి పెంచుకోవాల్సిన అవసరం చాలా అవసరం. చాలా మందికి ఈ కరోనా గురించి అవగాహన లేక భయంతోనే మరింత ప్రమాదం తెచ్చుకుంటున్నారు. భయపడితే శరీంలో రోగనిరోధక శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు భయాన్ని తొలగించుకొని.. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలో తెలుసుకోవాలి.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో... వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో క్యారెట్, బీట్రూట్ లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రెండు కలిపి తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అసలు క్యారెట్, బీట్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు.. క్యారెట్ 1, బీట్రూట్1, కరివేపాకు 10 ఆకులు, అల్లం ఒక ముక్క, నిమ్మరసం ఒక టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత..
ముందుగా క్యారెట్, బీట్రూట్ లను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్నింటినీ జ్యూసర్ లో వేసి మొత్తగా మిక్సీ పట్టాలి. తర్వాత దానిని వడపోసి.. దానిలో ఉప్పు రుచికి తగినంత వేయాలి. ఆ తర్వాత అందులో నిమ్మరసం కలపాలి. అంతే.. టేస్టీ క్యారెట్ జ్యూస్ రెడీ..
దీని వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం..
బీట్రూట్ లో ఐరన్, విటమిన్ సీ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు శరీరంలో పెరుగుతాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ పై పోరాడటానికి సహాయపడతాయి. దీనిలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి చాలా అవసరం.
అంతేకాదు... బీట్‌రూట్‌లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, సిలు ఎదిగే పిల్లలకు తోడ్పడతాయి. పిల్లలు రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కాగా.. ఇప్పటి వరకు అందరూ బీట్ రూట్ ని జ్యూస్ రూపంలో గానీ, కర్రీ రూపంలో గానీ తీసుకోమని సలహా ఇస్తుంటారు. అయితే.. దీనితో నోరూరించే బీట్రూట్ పచ్చడి కూడా చేయవచ్చు.
ఇక క్యారెట్ లో విటమిన్ ఏ , సీ ఎక్కువగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సీడెంట్స్ గా పనిచేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచే సెల్స్ ని డ్యామేజ్ చేయకుండా సహాయం చేస్తాయి. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడాతాయి. ఈ కరోనా సమయంలో అందరూ కచ్చితంగా ఈ జ్యూస్ తీసుకోవడం ఉత్తమం.