సమోవర్ టీ.. కలకత్తాలో ఫుల్ ఫేమస్...మీరెప్పుడైనా రుచి చూశారా...?
కోల్‌కతాలోని బెంటింక్ స్ట్రీట్‌లో ఉన్న ఈ దుకాణాన్ని ‘టాంకీ చాయ్ షాప్’ అని కూడా పిలుస్తారు. ఈ దుకారణంలో టీ తయారుచేయడానికి సమోవర్లు ఉపయోగిస్తారు.
టీ లవర్స్ కు ఈ విషయం సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ స్పెషల్ ఛాయ్ ఒక్కసారైనా రుచి చూడాలన్న కోరిక కలిగిస్తుంది. అంతగా ఊరిస్తున్న విషయం ఏంటంటారా? కలకత్తలో ఓ 98 సంవత్సరాల చాయ్ దుకాణం ఉంది.
ఇందులో సమోవర్ లో టీ తయారు చేస్తారు. ఇది ఆరోగ్యంతో పాటు ఎంతో రుచినీ కలిగి ఉంటుంది. ఒక్కసారి ఈ సమోవర్ ఛాయ్ రుచి చూస్తే మీరిక వదిలపెట్టరట. సమోవర్ అంటే ఓ రకమైన రాగి పాత్ర. ఇంకా చెప్పాలంటే.. పాతకాలంలో ఇంట్లో నీటిని వేడిచేసుకోవడానికి వాడే బాయిలర్స్ లాంటివన్న మాట.
ఇందులో సమోవర్ లో టీ తయారు చేస్తారు. ఇది ఆరోగ్యంతో పాటు ఎంతో రుచినీ కలిగి ఉంటుంది. ఒక్కసారి ఈ సమోవర్ ఛాయ్ రుచి చూస్తే మీరిక వదిలపెట్టరట. సమోవర్ అంటే ఓ రకమైన రాగి పాత్ర. ఇంకా చెప్పాలంటే.. పాతకాలంలో ఇంట్లో నీటిని వేడిచేసుకోవడానికి వాడే బాయిలర్స్ లాంటివన్న మాట.
కోల్‌కతాలోని బెంటింక్ స్ట్రీట్‌లో ఉన్న ఈ దుకాణాన్ని ‘టాంకీ చాయ్ షాప్’ అని కూడా పిలుస్తారు. ఈ దుకారణంలో టీ తయారుచేయడానికి సమోవర్లు ఉపయోగిస్తారు.
సమోవర్లు అంటే ముందుగా చెప్పుకున్నట్లు బాయిలర్లు, లేదా పెద్ద పెద్ద రాగి పాత్రలు. వీటిని మన దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు నీళ్లు మరిగించడానికి లేదా టీ / కాఫీ కాయడానికి ఉపయోగించేవారు.
ప్రస్తుతం ఈ దుకాణం మహేంద్ర సింగ్ ధోని అనే వ్యక్తి సొంతం. అతని ఆధ్వర్యంలోనే నడుస్తోంది. ఈ షాపును నిర్వహిస్తున్న తరంలో అతను రెండోవాడు. అతను 40 సంవత్సరాలుగా దుకాణాన్ని విజయవంతంగా నడుపుతున్నాడు.
నీరు మరిగించడానికి రాగిపాత్రలను ఉపయోగించడం టీ రుచికి ప్రత్యేకతను ఇస్తుంది. దీనివల్ల ప్రపంచం నలుమూలల నుండి కలకత్తాకు వచ్చేవారు తప్పనిసరిగా ఈ టీ తాగకుండా వెళ్లరు.
రాగి పాత్రలలో నీటిని మరిగించే ప్రక్రియ ద్వారా టీలో అమ్లత్వం తగ్గుతుంది. అందుకే ఈ రుచి బాగా నచ్చుతుందని అంటున్నారు. అలాగే, ఈ టీ షాపులోని నీళ్లు మరుగుతున్న పెద్ద పెద్ద సమోవర్స్ చాలా అద్భుతంగా కనిపించి, కనువిందు చేస్తాయి.
మహేంద్ర సింగ్ ధోని చెప్పేదాని ప్రకారం ఈ షాపులో ప్రతీరోజు వెయ్యి కప్పుల టీలు అమ్ముడుపోతాయి. ఎప్పుడైనా కలకత్తా వెడితే ఈ టీని తాగడం.. ఆ షాపులో ఫొటోలు దిగడం మర్చిపోకండేం.