వీళ్లు ఈ పప్పు కూరలను ఖచ్చితంగా తినాలి
మాంసంలో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ కొంతమంది నాన్ వెజ్ ను అస్సలు తినరు. ఇలాంటి వారు కొన్ని రకాల పప్పులను తింటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

పప్పు
మాంసం తినేవారికంటే తినని వారిలోనే పోషకాల లోపం ఎక్కువగా ఏర్పడుతుంది. ఎందుకంటే మాంసాహారంలో మన శరీరానికి అవసరమైన పోషకాలుంటాయి. దీంతో మనం వేరే ఆహారాలపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అయితే పోషకాలు ఒక్క మాంసంలోనే కాదు కాయధాన్యాల్లో కూడా ఉంటాయి. శాఖాహారులు తమకు అవసరమైన పోషకాలను పప్పులను పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
పప్పు
నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల పప్పుల్లో ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. వీటిని మీరు తింటే పోషకాల లోపం తొలగిపోవడమే కాకుండా.. మీకు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఈ పప్పులను తింటే మీరు సులువుగా బరువు తగ్గొచ్చు.అలాగే కండరాల నష్టం జరిగే అవకాశం ఉండదు. అంతేకాదు థైరాయిడ్ హార్మోన్ కూడా సక్రమంగా ఉంటుంది. అసలు ప్రోటీన్ లోపాన్ని అధిగమించడానికి ఎలాంటి పప్పులను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పెసరపప్పు
ప్రోటీన్లు పుష్కలంగా ఉండే పప్పుల్లో పెసరపప్పు ఒకటి. చాలా మంది పెసరపప్పును చాలా ఇష్టంగా తింటుంటారు. ఈ పప్పు టేస్టీగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తుంది. 100 గ్రాముల పెసరపప్పులో 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంతేకాకుండా ఇది చాలా సులువుగా అరుతుంది. మీరు హెల్తీగా బరువు తగ్గాలనుకుంటే ఈ పప్పును మీ డైట్ లో చేర్చుకోండి. ఈ పప్పు థైరాయిడ్, పీసీఓడీ సమస్యలతో బాధపడుతున్న మహిళలకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.
మినప పప్పు
మినప పప్పు కూడా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో కాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పప్పును తింటే మీ ఎముకలు బలంగా ఉంటాయి. ఈ పప్పు ఆడవారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పప్పును తినడం వల్ల పీరియడ్స్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
ఎర్రపప్పు
ఎర్రపప్పును చాలా తక్కువ మంది తింటారు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. 100 గ్రాముల ఎర్ర పప్పులో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఈ పప్పులో ఫైబర్ కూడా మెండుగా ఉంటుంది. ఈ పప్పు చారును తింటే జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది. దీనిలో ఫోలెట్ కూడా మెండుగా ఉంటుంది. ఈ పప్పు హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. మైగ్రేన్ సమస్య రాకుండా చేస్తుంది.
కందిపప్పు
మాంసంలో ఉన్నట్టే కందిపప్పులో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల కందిపప్పుల్లో 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ పప్పును తినడం వల్ల మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. దీనిలో పుష్కలంగా ఉండే మెగ్నీషియం మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ పప్పును తింటే బీపీ కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పప్పును తింటే జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది.