బట్టర్ మిల్క్ కు పోపు వేయండి.. టేస్ట్ అదరగొట్టండి..
వేసవిలో శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన పానీయం బట్టర్ మిల్క్. దీన్ని పలుచగా అన్నంలో కలుపుకుని తిన్నా.. లేదా కాస్త ఉప్పు, నిమ్మకాయ పిండుకుని తాగినా శరీరాన్ని వేడి సెగల బారినుండి కాపాడుతుంది.
వేసవిలో శరీరాన్ని చల్లబరిచే అద్భుతమైన పానీయం బట్టర్ మిల్క్. దీన్ని పలుచగా అన్నంలో కలుపుకుని తిన్నా.. లేదా కాస్త ఉప్పు, నిమ్మకాయ పిండుకుని తాగినా శరీరాన్ని వేడి సెగల బారినుండి కాపాడుతుంది.
అయితే బట్టర్ మిల్క్ ను ఇంట్లో తయారు చేసేప్పుడు ఓ గ్లాసులో పెరుగు వేసి నీల్లు పోసి రెండు గ్లాసులతో గిలక్కొడతారు. ఆ తరువాత దీనికి కాస్త జీలకర్రపొడి, పుదీనా, ఉప్పు జోడించి తాగుతుంటారు.
అయితే బట్టర్ మిల్క్ కు పోపు పెడతారని తెలుసా? అది మీ బట్టర్ మిల్క్ రుచిని మరింతగా పెంచుతుందని తెలుసా?
కొన్నిచోట్ల బట్టర్ మిల్క్ ను సర్సోంకా సాగ్ తో కలిపి తింటే ఆ రుచి సూపర్ అంటారు. ఇప్పుడు ఈ తడ్కా బటర్ మిల్క్ ను ఇంట్లో సులువుగా ఎలా చేసుకోవచ్చో చూడండి...
తడ్కా బటర్ మిల్క్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
2 కప్పుల చిక్కటి పుల్ల పెరుగు
అవసరానికి తగినంత నల్ల ఉప్పు
1 కట్ట కరివేపాకు
1 టీస్పూన్ రిఫైన్డ్ ఆయిల్
1/2 టీస్పూన్ ఆవాలు
1 టీస్పూన్ జీలకర్ర
4 పుదీనా ఆకులు
1/2 టీస్పూన్ తురిమిన అల్లం
2 కప్పుల నీరు
తడ్కా బటర్ మిల్క్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
2 కప్పుల చిక్కటి పుల్ల పెరుగు
అవసరానికి తగినంత నల్ల ఉప్పు
1 కట్ట కరివేపాకు
1 టీస్పూన్ రిఫైన్డ్ ఆయిల్
1/2 టీస్పూన్ ఆవాలు
1 టీస్పూన్ జీలకర్ర
4 పుదీనా ఆకులు
1/2 టీస్పూన్ తురిమిన అల్లం
2 కప్పుల నీరు
తడ్కా బటర్ మిల్క్ తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో నీళ్లు, పెరుగు వేసి బాగా గిలక్కొట్టాలి.
ಮತ್ತೊಂದೆಡೆ, ಲಸ್ಸಿ ಮಜ್ಜಿಗೆಗಿಂತ ದಪ್ಪವಾಗಿರುತ್ತದೆ. ಇದು ಹೆಚ್ಚು ಕೊಬ್ಬನ್ನು ಹೊಂದಿರುತ್ತದೆ ಮತ್ತು ರುಚಿಯಲ್ಲಿ ಸಿಹಿಯಾಗಿರುವುದರಿಂದ ಹೆಚ್ಚಿನ ಕ್ಯಾಲೊರಿಗಳನ್ನು ಹೊಂದಿರುತ್ತದೆ.
ఇప్పుడు దీనికి జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, పుదీనా ఆకులు, తురిమిన అల్లం వేసి 4-5 నిమిషాల పాటు మళ్లీ బాగా కలపండి.
ఇప్పుడు దీన్ని పక్కనపెట్టి... ఒక చిన్న బాణలిలో 1 స్పూన్ నూనె వేసి ఆవాలు, కరివేపాకు వేయండి. ఇవి చిటపటమని వేగాలి.
పోపును గిన్నెలోని మజ్జిగకు కలిపి.. కూజా మూత పెట్టేయండి.
5 నిమిషాల తరువాత, గిన్నె మూత తెరిచి, మజ్జిగ, పోపు బాగా కలిసేలా కలియబెట్టండి. ఆ తరువాత గాజు గ్లాసుల్లో పోసుకుని ఎంచక్కా ఎంజాయ్ చేయండి.