లంచ్ లో అన్నంకి బదులు ఏం తింటే బరువు తగ్గుతారో తెలుసా?
బరువు తగ్గాలి అనకునేవారికి మాత్రం.. అన్నం కరెక్ట్ ఛాయిస్ కాదు అని చెప్పొచ్చు. మితంగా తింటే పర్లేదు కానీ.. అన్నం ఎక్కువగా తినడం వల్ల.. బరువు పెరిగిపోతాం.
Cooked rice
దాదాపు మనందరికీ భోజనం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అన్నమే. ముఖ్యంగా సౌత్ ఇండియన్స్.. రోజుకి రెండు పూటలా అన్నమే తింటారు. అన్నం తినకపోతే.. కొందరికి భోజనం చేసిన ఫీలింగే రాదు. అయితే... బరువు తగ్గాలి అనకునేవారికి మాత్రం.. అన్నం కరెక్ట్ ఛాయిస్ కాదు అని చెప్పొచ్చు. మితంగా తింటే పర్లేదు కానీ.. అన్నం ఎక్కువగా తినడం వల్ల.. బరువు పెరిగిపోతాం.
ఎందుకంటే అన్నంలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి, దీని కారణంగానే బరువు పెరిగిపోతూ ఉంటారు. రక్తంలో షుగర్ లెవల్స్ కూడా పెరగడానికి కారణం అవుతాయి. అదే అన్నం తగ్గించే వేరే ఆహారం తీసుకోవడం వల్ల... షుగర్ సమస్యను కంట్రోల్ లో ఉంచడం నుంచి.. బరువు తగ్గించడంలోనూ సహాయం చేస్తాయి. మరి.. లంచ్ లో అన్నం మానేసి.. ఏం తింటే బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం...
ఓట్స్..
మధ్యాహ్నం లంచ్ లో మీరు వైట్ రైస్ కి బదులు ఓట్స్ తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. ఓట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఒక కప్పు ఓట్ మీల్ లో 7.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఓట్స్‌లో విటమిన్లు, ఖనిజాలు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మధ్యాహ్నం పూట ఓట్స్ తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. బరువును కూడా తగ్గిస్తుంది.
barlie
బార్లీ
బార్లీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. బార్లీలో బియ్యం కంటే ఎక్కువ ప్రొటీన్లు , ఫైబర్ ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి ఆకలి బాధలను అరికట్టడంలో , మధుమేహాన్ని నియంత్రించడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. బార్లీని కూడా మనం చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. కడుపు ఎక్కువ సేపు నిండిన అనుభూతి కలిగిస్తుంది.
బ్రౌన్ రైస్
వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే రెడ్ రైస్ ఆకలిని నియంత్రిస్తుంది. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. అలాగే, రెడ్ రైస్ వైట్ రైస్ కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తీసుకోవచ్చు.
గోధుమ రవ్వ..
గోధుమ రవ్వ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో పీచు ఎక్కువగా ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది. అలాగే మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.