MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నారా? వీటిని తినండి స్టోన్స్ కరిగిపోతాయి

కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నారా? వీటిని తినండి స్టోన్స్ కరిగిపోతాయి

మన శరీరంలోని ప్రతి అవయవం ఎంతో ముఖ్యమైంది. వీటిలో మూత్రపిండాలు ఒకటి. ఇది మనం ఆరోగ్యంగా ఉండటానికి చాలా చాలా అవసరం. ఎన్నో కారణాల వల్ల మన మూత్రపిండాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా ప్రస్తుతం చాలా మంది కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని ఆహారాలు కిడ్నీస్టోన్స్ ను తగ్గించడానికి సహాయపడతాయి. 
 

R Shivallela | Published : Oct 13 2023, 01:54 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
kidney stone

kidney stone

కిడ్నీలు మన శరీరంలోని అతిముఖ్యమైన అవయవాలు. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి శరీరంలోని ఎన్నో ముఖ్యమైన పనులను చేస్తుంది. కిడ్నీలు మన శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతాయి. అలాగే రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కీడ్నీలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్న వారు ఎక్కువవయ్యారు. 

29
Asianet Image

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం వల్ల విపరీతమైన నొప్పి వస్తుంది. దీంతో ఏ పనీ చేయలేరు. జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుని ఆహారపు అలవాట్లను మార్చుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. ఇందుకోసం ఏమేం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

39
Asianet Image

ప్రోబయోటిక్ ఆహారాలు 

పెరుగు, కేఫీర్ వంటి పులియబెట్టిన ఆహారాలు గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో సహాయపడతాయి. ఈ ఆహారాలను మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి ఎంతగానో సహాయపడతాయి. 
 

49
Asianet Image

పసుపు

పసుపు ఎన్నో ఔషధ గుణాలున్న పదార్థం. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇందుకోసం పసుపును టీ, సూప్, పులుసు, డిటాక్స్ వాటర్ రూపంలో తీసుకోవచ్చు. పసుపు మన మూత్రపిండాలను శుభ్రపరచడానికి, విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలో ఉండే కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రాళ్లు ఏర్పడకుండా కాపాడుతాయి. 

59
Image: Getty

Image: Getty

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ పండ్లను తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మూత్రపిండాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే నారింజ, ద్రాక్ష, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లను రోజూ తినండి. ఈ పండ్లు మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రాళ్లను నివారిస్తాయి. 

69
Asianet Image

అల్లం

అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అల్లం మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం అల్లం టీ, లేదా డిటాక్స్ వాటర్,  స్మూతీలను తాగండి. ఇది మంటను తగ్గించడానికి, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలను తగ్గించడానికి సహాయపడుతుంది.
 

79
Asianet Image

సెలెరీ

సెలెరీలో సహజ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో నీరు పేరుకుపోనివ్వవు. అలాగే మూత్రం ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. విష పదార్థాలు కూడా బయటకు పోతాయి. 
 

89
cucumber

cucumber

కీరదోసకాయ

కీరదోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ మూత్రం ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడానికి కూడా సహాయపడుతుంది. 

ఆపిల్ పండు

పోషకాలు పుష్కలంగా ఉంటే ఆపిల్ పండు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆపిల్స్ డైటరీ ఫైబర్ కు మంచి మూలం. ఇది కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చూడటానికి సహాయపడుతుంది. 
 

99
Asianet Image

దానిమ్మ

దానిమ్మ రసం కూడా కిడ్నీ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. ఈ జ్యూస్ ను వీళ్లు క్రమం తప్పకుండా తాగడం వల్ల దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతాయి. 

నీరు

మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా ఉండటానికి, ఉన్న వాటిని కరిగించడానికి మీరు నీటిని పుష్కలంగా తాగండి. నీటిని పుష్కలంగా తాగడం వల్ల శరీరంలో ఉండే పదార్థాలు పలుచగా మారి రాళ్లు ఏర్పడే ప్రమాదం తప్పుతుంది. 

R Shivallela
About the Author
R Shivallela
ఆహారం
ఆరోగ్యం
 
Recommended Stories
Top Stories