పిండిలో ఇదొక్కటి కలిపి రోటీ తింటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు..!
మీరు ఒక చిన్న ట్రిక్ వాడటం వల్ల కచ్చితంగా ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఆ ట్రిక్స్ ఏంటో చూద్దాం…
ఈ రోజుల్లో బరువు తగ్గాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. దానికోసం ఎక్కువ మంది తిండి మానేస్తూ ఉంటారు. మరి కొందరు అన్నం మానేసి.. దానికి బదులు రోటీలు తింటూ ఉంటారు.అయినా చాలా మంది బరువు తగ్గడం లేదు అని బాధపడుతుంటారు. అయితే.. మీరు ఒక చిన్న ట్రిక్ వాడటం వల్ల కచ్చితంగా ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఆ ట్రిక్స్ ఏంటో చూద్దాం…
బరువు తగ్గాలి అంటే అన్నం మానేయాలి అని చాలా మంది నమ్ముతారు. మరి.. డిన్నర్ లో అన్నం తినకూడదు అంటే.. మరి ఏం తినాలి అనే సందేహం కలుగుతుంది. అలా అని నార్మల్ రోటీ తింటే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. అందుకే ఆ రోటీ కోసం పిండి కలిపే సమయంలో పాలకూర కలిపితే చాలు. మీరు చదివింది నిజమే. పాలకూర పేస్టును వేసి రోటీ పిండి తయారు చేసుకొని.. దానితో రోటీ చేసుకొని ప్రతిరోజూ డిన్నర్ లో తింటే కచ్చితంగా బరువు తగ్గవచ్చట.
పాలకూరను రోటీతో కలిపి తీసుకుంటే కలిగే లాభాలు…
బరువు తగ్గాలి అనే కోరిక ఉన్నవారు కచ్చితంగా ఈ పాలకూర రోటీ తినాల్సిందే. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. అలానే పాలకూరలో శరీరానికి అవసరమైన పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా ఉంటాయి. పాలకూరలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి కూడా సహాయపడుతుంది.
మరి ఈ పాలకూర రోటీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం…
రుచికరమైన పాలకూర చపాతీ చేయడానికి కావలసిన పదార్థాలు:
2 కప్పులు - గోధుమ పిండి
1 బంగాళదుంప
1/2 కప్పు పాలకూర
కారం పొడి 1 స్పూన్
అర చెంచా గరం మసాలా పొడి
అవసరమైనంత ఉప్పు
అవసరమైన మొత్తంలో నూనె
పాలకూర చపాతీ ఎలా చేయాలి?
బంగాళదుంపలు, పాలకూరను విడివిడిగా బాణలిలో ఉడకబెట్టి, వాటిని బాగా మెత్తగా చేయాలి. ఇప్పుడు మరో పాత్రలో బంగాళదుంప గుజ్జు, పాలకూర, గోధుమపిండి వేసి కలపాలి. దీని తరువాత, కారం, ఉప్పు, గరంమసాలా పొడి, కొంచెం నీరు చల్లి చపాతీ పిండిలా బాగా మెత్తగా చేసి అరగంట నాననివ్వాలి.
తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీలా కలిపి ఉంచుకోవాలి. దీని తర్వాత చపాతీలాగా ఒత్తుకొని.. నెయ్యితో కాల్చుకుంటే సరిపోతుంది.