MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • డ్రై ఫ్రూట్స్ తింటే బరువు పెరుగుతారా..? ఏది నిజం..?

డ్రై ఫ్రూట్స్ తింటే బరువు పెరుగుతారా..? ఏది నిజం..?

అతి సర్వత్రా వర్జయేత్ అనే సామేత మీరు ఎప్పుడైనా విన్నారా? మితంగా ఉంటే.. ఏదైనా మంచే చేస్తుంది.  కానీ, అదే.. అతిగా మారితే.. సమస్యలు తప్పవు. ఈ డ్రై ఫ్రూట్స్ విషయంలోనూ అదే జరుగుతుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 11 2023, 12:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయం చిన్న పిల్లలని అడిగినా చెప్పేస్తారు. అందుకే, ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ ని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు కూడా మనకు సూచిస్తూ ఉంటారు. కానీ, ఇదే డ్రై ఫ్రూట్స్ కారణంగా మనం అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటామని మీకు తెలుసా?  నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. అతిగా డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయట. ఆ సమస్యలు ఏంటి..? అసలు ఎంత మొత్తంలో మనం డ్రై  ఫ్రూట్స్ తీసుకోవాలి.. ఇలాంటి విషయాలు ఈ రోజు తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అతి సర్వత్రా వర్జయేత్ అనే సామేత మీరు ఎప్పుడైనా విన్నారా? మితంగా ఉంటే.. ఏదైనా మంచే చేస్తుంది.  కానీ, అదే.. అతిగా మారితే.. సమస్యలు తప్పవు. ఈ డ్రై ఫ్రూట్స్ విషయంలోనూ అదే జరుగుతుంది. మంచివి కదా అని.. ఈ డ్రై ఫ్రూట్స్ ని అతిగా తినడం వల్ల, చాలా సమస్యలు ఎదురౌతాయంట. మరి, ఆ సమస్యలు ఏంటో ఓసారి చూద్దాం..
 

36

డ్రై ఫ్రూట్స్ ని తక్కువ మొత్తంలో తింటే ఎవరైనా ఆరోగ్యంగా ఉంటారు. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కానీ, అదే డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువగా తింటేే, బరువు అతిగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. డ్రై ఫ్రూట్స్ లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అవి, బరువు పెంచడానికి కారణం అవుతాయి.

46

అంతేకాదు, డ్రై ఫ్రూట్స్ అతిగా తినడం వల్ల, జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి.  డ్ర ఫ్రూట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ తక్కువగా తీసుకుంటే, ఫుడ్ అరగడానికి కూడా సహాయపడుతుంది. కానీ, అదే ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
 

56
dry fruits

dry fruits

అందుకే డ్రై ఫ్రూట్స్ ని ఎంత మోతాదులో తినాలి అనే విషయం తెలుసుకోవాలి. ముందుగా పిస్తా సంగతి చూద్దాము ఇందులో మిగిలిన డ్రై ఫ్రూట్స్ కంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వీటిని రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు.
 


అలాగే జీడిపప్పు తినటం వల్ల పెద్ద ఆసియంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చు అలా అని వారానికి 28 జీడిపప్పులు కన్నా ఎక్కువ తినటం మంచిది కాదు అంటున్నారు వైద్యులు.
 

66

ఎండు ద్రాక్షని ఎంత మోతాదులో తిన్నా పర్వాలేదు ఇందులో విటమిన్ బి పొటాషియం ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకి గుప్పెడు ఎండు ద్రాక్ష తినవచ్చు. అలాగే వాల్ నట్స్ రోజుకి మూడు నాలుగు నుంచి తీసుకోకూడదు. వాల్నట్స్ మీద ఉండే స్కిన్ ఫ్లేవర్ అంత టేస్టీగా ఉండదు.



కానీ 90 శాతం ఆంటీ ఆక్సిడెంట్సు ఫెనోలికే యాసిడ్స్ ఈ స్కిన్ లోనే ఎక్కువగా ఉంటాయి ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో చాలా ఎఫెక్ట్ గా పని చేస్తాయి. అలాగే బాదం గింజలు రోజుకి నాలుగు నుంచి ఏడు గింజల వరకు తినటం ఆరోగ్యానికి మంచిది. అలాగే ఖర్జూరం ఇది తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది.
 


ఇందులో ప్రాక్టోజ్ రిచ్ గా ఉంటుంది మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండడానికి ఖర్జూరం ఉపయోగపడుతుంది. అలాంటి ఈ ఖర్జూరాన్ని రోజుకి ఒకటి లేదా రెండు తీసుకుంటే సరిపోతుంది. అయితే నట్స్ ని నేరుగా కాకుండా నానబెట్టి తినటం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved