రెడ్, బ్లాక్, బ్రౌన్ రైస్: బరువు తగ్గాలంటే ఈ అన్నమే తినండి
వైట్ రైస్ కంటే బ్లాక్, రెడ్, బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. మరి ఈ మూడింటిలో బరువు తగ్గడానికి ఏ రైస్ సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

రైస్
మన దేశంలో చాలా మంది మూడు పూటలా అన్నాన్నే తింటుంటారు. కానీ అన్నం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. ముఖ్యంగా వైట్ రైస్. ఎందుకంటే ఈ వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర బరువును మరింత పెంచుతాయి.
అందుకే చాలా మంది వైట్ రైస్ ను ఎక్కువగా తినడం మానేశారు. అయితే దీని ప్లేస్ లో బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ లను తినడం అలవాటు చేసుకున్నారు. నిజానికి ఇవి చాలా హెల్తీవి. అయితే ఈ మూడింటిలో ఏది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుందో తెలియదు. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
వైట్ రైస్
మన దేశంలో చాలా మంది వైట్ రైస్ నే ఎక్కువగా తింటారు. ఈ వైట్ రైస్ టేస్టీగా ఉంటుంది. జీర్ణం కూడా సులువుగా అవుతుంది. కానీ ఈ వైట్ రైస్ ను ఎక్కువగా పాలిష్ చేస్తాయి. కాబట్టి దీనిలో ఫైబర్, పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. దీన్ని తిన్నా వెంట వెంటనే ఆకలి అవుతుంది. దీంతో వైట్ రైస్ ను ఎక్కువగా తింటారు. కాబట్టి దీన్ని తింటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే బరువు కూడా ఎక్కువగా పెరుగుతారు.
బ్రౌన్ రైస్
బ్రౌన్ రైస్ ను పాలిష్ చేయరు. కాబట్టి దీనిలో విటమిన్ బి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రైస్ ను తింటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. కాబట్టి మీరు హెవీగా తినలేరు. అనవసరమైన ఆహారాలకు దూరంగా ఉంటారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు బ్రౌన్ రైస్ ను తినడం మంచిదని చెప్తారు.
రెడ్ రైస్
రెడ్ రైస్ కూడా మంచి హెల్తీ ఫుడ్. వీటిలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రెడ్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ వైట్ రైస్ కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఫాస్ట్ గా పెరగవు. నిపుణుల ప్రకారం.. బరువు తగ్గాలనుకునేవారికి, షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలనుకునేవారికి ఇది బెస్ట్.
బ్లాక్ రైస్
బ్లాక్ రైస్ కూడా వైట్ రైస్ కంటే చాలా మంచిది. దీనిలో ప్రోటీన్లు, ఫైబర్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ బ్లాక్ రైస్ ను తింటే కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. అలాగే శరీరానికి అవసరమైన శక్తి కూడా అందుతుంది. ఈ బ్లాక్ రైస్ ను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు కూడా తగ్గుతారని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
బరువు తగ్గడానికి ఏ రైస్ బెస్ట్?
బరువు తగ్గాలనుకునే వారు వైట్ రైస్ ను మాత్రం తినకూడదు. ఎందుకంటే వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు మీ బరువును మరింత పెంచుతాయి. కాబట్టి మీరు వైట్ రైస్ కు బదులగా రెడ్ రైస్, బ్లాక్, బ్రౌన్ రైస్ లో ఏదో ఒక దాన్ని తినొచ్చు. వీటిలో ఉండే పోషకాలు, ఫైబర్ మీ కడుపు నిండుగా ఉంచుతాయి. అనవసరంగా ఆహారాన్ని తినడాన్ని తగ్గించి మీ బరువును తగ్గించడానికి సహాయపడతాయి.