MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • ఎండాకాలంలో కీరదోసకాయలు ఎందుకు తినాలో తెలుసా?

ఎండాకాలంలో కీరదోసకాయలు ఎందుకు తినాలో తెలుసా?

వేసవి వచ్చేసింది. కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సీజన్ లో మన శరీరం డీహైడ్రేషన్ బారిన ఎక్కువగా పడుతుంటుంది. ఇది ప్రాణాంతకం. అందుకే ఎండాకాలంలో మనం హైడ్రేట్ గా, ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ఆహారాలను ఖచ్చితంగా తినాలి. వీటిలో కీరదోసకాయ ఒకటి.   

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 16 2024, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
cucumber

cucumber

ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు, కూరగాయలను, పోషకాహారాలను ఎక్కువగా తింటున్నారు. ఇది మంచి విషయమే కానీ.. మన ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని ఆహార పదార్థాల గురించి మాత్రం మర్చిపోతుంటాం. ఇలాంటి వాటిలో కీరదోసకాయ ఒకటి. ఇవి చాలా తక్కువ ధరలోనే దొరుకుతాయి. కానీ వీటిలో ఎన్నో పోషకాలుంటాయి. దీన్ని తింటే మన ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. అసలు ఎండాకాలంలో కీరదోసకాయలను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
cucumber

cucumber

హైడ్రేషన్

ఎండాకాలంలో హైడ్రేషన్ చాలా చాలా  అవసరం. అయితే ఎండాకాలంలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కీరదోసకాలను తింటే బాడీ డీహైడ్రేట్ అయ్యే అవకాశమే ఉండదు. దోసకాయలు క్రంచీగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. అలాగే ఇవి మిమ్మల్ని చల్లగా కూడా ఉంచుతాయి. 
 

38
Cucumbers

Cucumbers

పోషకాహారం 

కీరదోసకాయలో నీటితో పాటుగా ఎన్నో ముఖ్యమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం లు మెండుగా ఉంటాయి. ఇవి మన ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అలాగే ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహించడానికి కూడా సహాయపడతాయి.

48
cucumber

cucumber

బరువు నియంత్రణ

కీరదోసకాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వాటర్, ఫైబర్ కంటెంట్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీరు బరువు పెరగకుండా చేయడానికి బాగా సహాయపడతాయి. వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చడం వల్ల ఆకలి తగ్గుతుంది. అలాగే కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకుండా చేస్తుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు. 
 

58
cucumber

cucumber

చర్మం చల్లగా

ఎండాకాలం ఎండల వల్ల మన చర్మం బాగా ప్రభావితమవుతుంది. కీరదోసకాయలలో సిలికాన్ డయాక్సైడ్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది చర్మ స్థితిస్థాపకత, ఆర్ద్రీకరణకు సహాయపడుతుంది. కీరదోసకాయ ముక్కలు లేదా కీరదోసకాయ కలిగిన పదార్థాలను ఉపయోగించి  సూర్యరశ్మి సంబంధిత చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. 
 

68
cucumber

cucumber


జీర్ణక్రియ

కీరదోసకాయలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల పేగు కదలికలు మెరుగుపడతాయి. అలాగే కడుపు అసౌకర్యం, ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం సమస్య కూడా ఉండదు. ఎండాకాలంలో నిర్జలీకరణం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. కీరదోసకాయను తింటే ఇలాంటి సమస్యే రాదు. 
 

78
cucumber

cucumber

నోటి దుర్వాసన

కీరదోసకాయలో సహజ శ్వాస రిఫ్రెష్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఎండను తట్టుకోవడానికి సహాయపడతాయి. కీరదోసకాయను తింటే నోటి దుర్వాసన కూడా రాదు. వీటిలో ఉండే ఫైటోకెమికల్స్ నోటి దుర్వాసనతో పోరాడి లోపలి నుంచి తాజా శ్వాసకు సహాయపడతాయి. 

88

సూర్యరశ్మి సమస్యలు

వడదెబ్బకు గురైన వారికి కీరదోసకాయలు బాగా సహాయపడతాయి. కీరదోసకాయ ముక్కల శీతలీకరణ ప్రభావం వడదెబ్బకు గురైన చర్మాన్ని ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఉబ్బరం, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved