MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • ఎండాకాలం కాదు, చలికాలంలో కొబ్బరి నీళ్లు ఎందుకు తాగాలో తెలుసా?

ఎండాకాలం కాదు, చలికాలంలో కొబ్బరి నీళ్లు ఎందుకు తాగాలో తెలుసా?

 మనకు తెలీకుండానే చర్మం డీహైడ్రేటెడ్ గా మారుతుంది. అందుకే.. కచ్చితంగా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. దీని వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 28 2024, 03:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 

కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. మనమందరం కేవలం ఎండాకాలం మాత్రమే ఈ కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటాం. కానీ.. చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కూడా మనకు చాలా ప్రయోజనాలు కలుగుతాయట. అవేంటో చూద్దాం..

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
coconut water

coconut water

 

చలికాలంలో చల్లని గాలులు మన చర్మాన్ని డ్రైగా మార్చేస్తాయి. ఈ సీజన్ లో మనకు మంచినీరు కూడా ఎక్కువగా తాగాలి అని అపిపించదు. దాని వల్ల కూడా మనకు తెలీకుండానే చర్మం డీహైడ్రేటెడ్ గా మారుతుంది. అందుకే.. కచ్చితంగా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. దీని వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.

 

35
Coconut water

Coconut water

 

కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మనశరీరానికి శక్తిని అందిస్తాయి.  నీరసం అనేది ఉండదు. రోజంతా శక్తివంతంగా, ఎనర్జిటిక్ గా ఉండటానికి సహాయం చేస్తుంది.

 

45

 

కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. చలికాలంలోనూ మనం తాగడం వల్ల ఆ యాంటీ ఆక్సిడెంట్స్ మనకు అందుతాయి. అంతేకాదు…రెగ్యులర్ గా కొబ్బరి నీరు తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ సీజన్ లో అనేక రోగాలు మనల్ని చుట్టుముట్టే సమస్య ఉంది. అవి రాకుండా ఉండాలంటే.. కొబ్బరి నీళ్లు తాగాల్సిందే. ముఖ్యంగా జలుబు, దగ్గు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

అంతేకాదు కొబ్బరి నీళ్లు రెగ్యులర్ గా తాగడం వల్ల మన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ సీజన్ లో  తొందరగా తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వదు. అందుకే.. ఈ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.

55

 

 

కొబ్బరి నీళ్లలో ఉండే నేచురల్ ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్.. మన శరీరం నుంచి టాక్సిన్స్ మొత్తం బయటకు వెళ్లేలా చేస్తాయి. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తుంది.

 

అంతేకాదు.. రెగ్యులర్ గా చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల  మన చర్మం కూడా అందంగా మారుతుంది. చర్మం చాాలా మృదువుగా మారుతుంది. వయసు కూడా తగ్గినట్లుగా కనిపిస్తారు.

 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Biryani vs Pulao: బిర్యానీ, పులావ్ ఒకటి కాదు.. రెండింటి మధ్య అసలు తేడా ఏంటో తెలుసా?
Recommended image2
Onion: రోజూ ఒక పచ్చిఉల్లిపాయ తింటే డయాబెటిస్ కంట్రోల్ ఉంటుందా?
Recommended image3
Chandramukhi Chicken Fry: నార్మల్ చికెన్ ఫ్రై బోర్ కొట్టిందా? ఈ చంద్రముఖి చికెన్ ఫ్రై ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved