వామ్మో.. పచ్చి గుడ్డు తాగితే ఇన్ని దుష్ప్రభావాలా?
కోడిగుడ్డు తినడం మంచిదే.. కానీ పచ్చి గుడ్డు తాగడం వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందామా..

పచ్చి గుడ్డు దుష్ప్రభావాలు
ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలుండే ఆహారం తినాలి. అందులో ఒకటి గుడ్డు. గుడ్డులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. అందుకే చాలామంది రోజూ గుడ్డు తింటారు. గుడ్డును ఉడికించి, ఆమ్లెట్, వేపుడు చేసుకొని ఇలా రకరకాలుగా తింటారు. కానీ కొంతమంది పచ్చి గుడ్డు తాగుతారు.
సాధారణంగా యుక్తవయస్సులోకి వచ్చిన అమ్మాయిలకి పచ్చి గుడ్డు తాగమంటారు. ఇది చాలా కాలంగా వస్తున్న ఆచారం. కానీ పచ్చి గుడ్డు తాగడం మంచిదా, కాదా అనేది ఇప్పటికీ చర్చనీయాంశమే.
పచ్చి గుడ్డు ఎందుకు తాగకూడదు?
పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా అనే బాక్టీరియా ఉండవచ్చు. ఇది అతిసారం, జ్వరం, వాంతులు వంటి సమస్యలకు కారణం కావచ్చు. ఈ బాక్టీరియా రక్తంలోకి చేరితే ప్రమాదకరం. పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది ప్రమాదకరం.
పచ్చి గుడ్డు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
- పచ్చి గుడ్డులోని తెల్లసొనలో ఉండే ప్రోటీన్ కొంతమందికి అలెర్జీలు కలిగిస్తుంది. చర్మ సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి రావచ్చు.
- బయోటిన్ లోపం, జుట్టు రాలడం, నాడీ సంబంధిత సమస్యలు రావచ్చు.
- గ్యాస్, కడుపు నొప్పి, అతిసారం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
- ఉడికించిన గుడ్డులో ఉండే పోషకాలు పచ్చి గుడ్డులో ఉండవు.
ముఖ్య గమనిక:
పచ్చి గుడ్డు తాగాలనుకుంటే శుభ్రంగా కడిగి, పగుళ్లు లేని గుడ్లను మాత్రమే తాగాలి. మింగకుండా నమిలి తినాలి.
* పచ్చి గుడ్డు కంటే ఉడికించిన గుడ్డు తినడం మంచిది.