Soaked Dates: రోజూ 2 నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా?
ఖర్జూరం రుచిగా ఉండటమే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రోజూ నానబెట్టిన ఖర్జూరం తినడం ద్వారా చాలా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అవెంటో ఇక్కడ చూద్దాం.

గజిబిజి లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా ప్రస్తుతం చాలా జబ్బులు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. బతకడానికి ఫుడ్ ఎంత ముఖ్యమో ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.
ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో కూరగాయలు, పండ్లు, వ్యాయామం ముందు వరుసలో ఉంటాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పండ్లు ప్రముఖంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా అందరూ ఇష్టంగా తినే ఖర్జూరం. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఖర్జూర ఎలా తినాలి?
ఖర్జూరాలని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినొచ్చు లేదా పచ్చిగా కూడా తినవచ్చు. నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవెంటో తెలుసుకుందాం.
ఖర్జూరాలని ఎందుకు నానబెట్టాలి?
ఖర్జూరాలను నానబెట్టడం వల్ల పోషకాలు సులభంగా అందుతాయి.
పిల్లల కోసం ఖర్జూరం
ఖర్జూరాన్ని పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది వారి ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకు రోజూ నానబెట్టిన ఖర్జూరం ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఒక ఖర్జూరంతో మొదలుపెట్టి.. రోజుకు 2, 3 కూడా ఇవ్వవచ్చు. వీటిని వారికి డైరెక్ట్ గా ఇవ్వచ్చు. లేదా మెత్తగా చేసి పాలల్లో కలిపి ఇవ్వవచ్చు.
ఖర్జూరం ఆరోగ్య ప్రయోజనాలు
నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
- హానికరమైన కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
- ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- నీరసం తగ్గిస్తుంది.
- రక్తహీనతకు మంచిది.
- గుండె ఆరోగ్యానికి మంచిది.
- అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
- జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.
- గ్యాస్, అసిడిటీ లాంటి సమస్యలను తగ్గిస్తుంది.
- పొట్టను శుభ్రంగా ఉంచుంది.
ఎప్పుడు తినాలి?
ఖర్జూరాలు చాలా రుచిగా ఉంటాయి. కాబట్టి చాలామంది వీటిని ఎప్పుడుపడితే అప్పుడే తింటుంటారు. అయితే వీటిని ప్రతిరోజూ రాత్రి 2 లేదా 3 నానబెట్టుకొని తెల్లారి ఉదయం ఖాళీ కడుపుతో తింటే మంచి ఫలితాలు చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు.