MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • థైరాయిడ్ పేషెంట్లు దీన్ని తింటే మంచిది

థైరాయిడ్ పేషెంట్లు దీన్ని తింటే మంచిది

థైరాయిడ్ పనితీరు సక్రమంగా ఉండాలంటే మంచి పోషకాహారాన్ని తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ కొన్ని ఆహారాలు థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తాయి. అందుకే ఇలాంటి ఆహారాలను థైరాయిడ్ పేషెంట్లు అస్సలు తినకూడదు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 05 2023, 04:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
thyroid

thyroid

ప్రస్తుతం థైరాయిడ్ పేషెంట్ల సంఖ్య బాగా పెరిగిపోతోంది. థైరాయిడ్ గ్రంథి ఒక ముఖ్యమైన హార్మోన్ గ్రంథి. ఇది మన శరీరం జీవక్రియ, పెరుగుదల, అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది సక్రమంగా పనిచేయకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సెంటర్స్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (సిడిసి) ప్రకారం.. థైరాయిడ్ గ్రంథిలో ఏదైనా సమస్య ఉంటే.. అది పనితీరును ప్రభావితం చేస్తుంది. శ్వాసక్రియ, జీర్ణక్రియ, మానసిక స్థితి, బరువు, హృదయ స్పందన రేటులో థైరాయిడ్ హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే దీనిని నియంత్రించడం చాలా ముఖ్యం. థైరాయిడ్ హార్మోన్లను నియంత్రించడానికి ఆహారం ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

37

సూడాన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం .. ఆరోగ్యకరమైన థైరాయిడ్ పనితీరును నిర్వహించడానికి సమతుల్య ఆహారాన్ని తినడం చాలా ముఖ్యమని కనుగొన్నారు. అయితే థైరాయిడ్ సమస్యతో బాధపడేవారికి ఓట్ మీల్ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

47

నిపుణుల ప్రకారం..  ఓట్ మీల్ ను తీసుకోవడం వల్ల థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. థైరాయిడ్ ఉన్నవారికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఓట్స్ లో ఉన్నాయని పరిశోధనలో చెబుతున్నారు.

57

ఓట్స్ లో విటమిన్ బి, విటమిన్ ఇ, జింక్, రాగి, మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. అలాగే వాటిని సమతుల్యంగా ఉంచుతాయి.  థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి అవసరమైన అయోడిన్ కూడా ఓట్స్ లో పుష్కలంగా ఉంటుంది. 
 

67

పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉండే ఓట్స్ శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే థైరాయిడ్ సంబంధిత స్వయం ప్రతిరక్షక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఓట్స్ సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

77

థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా ఉండేందుకు ఉత్తమ మార్గం మనం తినే ఆహారం. థైరాయిడ్ తో బాధపడేవారికి ఓట్స్ మంచి పోషకాహారం. ప్రతిరోజూ 30-50 గ్రాముల ఓట్ మీల్ ను తింటే మంచిని నిపుణులు చెబుతున్నారు. మీ రోజువారీ పోషక అవసరాలను తీర్చడానికి ఓట్స్ ను గంజి, ఓట్స్ స్మూతీలు, ఓట్స్ దోశగా తీసుకోవచ్చు.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Litchi Benefits: ఎముకలు ధృడంగా ఉండాలంటే ఈ ఒక్క పండు తింటే చాలు
Recommended image2
Biryani vs Pulao: బిర్యానీ, పులావ్ ఒకటి కాదు.. రెండింటి మధ్య అసలు తేడా ఏంటో తెలుసా?
Recommended image3
Onion: రోజూ ఒక పచ్చిఉల్లిపాయ తింటే డయాబెటిస్ కంట్రోల్ ఉంటుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved