పనీర్, చికెన్.. ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?
పన్నీరు వర్సెస్ చికెన్.. రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది అన్న డౌట్ చాలా మందికి వస్తుంటుంది. అయితే కొంతమంది పనీర్ మంచిదని అంటే మరికొంతమంది మాాత్రం చికెనే మంచిదని చెప్తుంటారు. మరి ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వెజ్-నాన్ వెజ్ లో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిది అన్న దానిపై చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే దీనిపై ఒక్కరూ ఒక్కో అభిప్రాయాన్నిచెప్తుంటారు. అయితే చాలా మందికి పనీర్ మంచిదా? చికెన్ మంచిదా? రెండింటిలో ఏది తినాలన్న డౌట్ చాలా మందికి వస్తుంటుంది. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
chicken
చికెన్
నాన్ వెజ్ లో చాలా మందికి చికెన్ అంటే చాలా ఇష్టం. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది అమైనో ఆమ్లాలకు మంచి వనరు. ఇది మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే బలమైన కండరాలను నిర్మించడానికి కూడా తోడ్పడుతుంది.
Paneer Tikka
పనీర్
పనీర్ ఒమేగా -3 , ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలకు అద్భుతమైన మూలం. పనీర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ను నివారించడానికి సహాయపడుతుంది. అలాగే ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. పనీర్ ను తింటే బ్రోన్కైటిస్, ఉబ్బసం, జలుబు వంటి వ్యాధులు తగ్గుతాయి.
chicken curry
ప్రోటీన్
పనీర్, చికెన్ ప్రోటీన్ల గురించి మాట్లాడినట్టైతే చికెన్ పనీర్ కంటే ముందు ఉంటుంది. ఎందుకంటే 100 గ్రాముల చికెన్ లో 31 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అదే 100 గ్రాముల పనీర్ లో కేవలం 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మీరు ప్రోటీన్ ను పొందాలనుకుంటే మాత్రం పనీర్ కంటే చికెన్ మంచిది. ఒకవేళ మీరు మాంసం తినకుంటే పనీర్ ను తినండి.
paneer
పోషకాలు
చికెన్ లో విటమిన్ బి12, నియాసిన్, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే పనీర్ కాల్షియానికి మంచి వనరు. ఇది మన ఎముకలను, దంతాలను బలంగా ఉంచుతుంది. ఇది రక్తం గడ్డకట్టడానికి, హృదయ స్పందన రేటును సాధారణంగా ఉంచడానికి, కండరాల సంకోచానికి అవసరం.
కేలరీలు
మీరు తక్కువ కేలరీల ఫుడ్ ను తినాలంటే మాత్రం పనీర్ కు బదులుగా చికెను తినండి. ఎందుకంటే 100 గ్రాముల చికెన్ లో 165 కేలరీలు మాత్రమే ఉంటాయి. అదే సమయంలో ఎక్కువ కేలరీలు తీసుకోవాలనుకుంటే పనీర్ ను మీ డైట్ లో చేర్చుకోండి. ఎందుకంటే 100 గ్రాముల పనీర్ లో 265-320 కేలరీలు ఉంటాయి.
ఏది ఆరోగ్యానికి మంచిది?
రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదనే విషయానికొస్తే.. మీరు చికెన్, పన్నీర్ రెండింటినీ తినొచ్చు. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. అయతే మీ పోషక అవసరాలను బట్టి రెండింటిలో దేనినైనా తినొచ్చు. ప్రోటీన్ పొందాలంటే మీరు ఈ రెండింటిలో దేనినైనా తినొచ్చు. ఈ రెండూ మీరు ప్రోటీన్ ను పొందడానికి, బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి.